close
Choose your channels

రిజర్వేషన్లపై పూరి సంచలన వ్యాఖ్యలు.. దళిత సంఘాల ఫైర్..

Saturday, August 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రిజర్వేషన్లపై పూరి సంచలన వ్యాఖ్యలు.. దళిత సంఘాల ఫైర్..

డాషింగ్ డైరెక్టర్ పూరి మరో డేరింగ్ స్టెప్‌ తీసుకున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆయన పోడ్‌కాస్ట్ వీడియోలతో అనేక విషయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేస్తున్నారు. ఆయన చేస్తున్న వీడియోలకు మంచి వీవర్‌షిప్ కూడా ఉంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా దేశంలో ఉన్న పేదలు, రిజర్వేషన్లపై పూరి చేసిన కామెంట్స్ చేశారు. పేద పిల్లలకు ఉచిత విద్య ఉండకూడదు. రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఉండకూడదు.. పేదలకు ఓటు హక్కు తీసేయాలన్నారు. నిరక్షరాస్యులకు ఓటు పీకేయాలి అంటూ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు.

పేద కుటుంబంలో పుట్టడం తప్పు కాదని.. పేదోడిగా చావడమే తప్పని పూరి పేర్కొన్నారు. హం లింకన్, నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్, అబ్దుల్ కలాం, రజినీకాంత్ వీళ్లంతా పేద కుటుంబంలోనే పుట్టారన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ స్కీములు తీసుకుని పేదోడిగా బతకడం అలవాటైపోయిందన్నారు. అందుకే వ్యవస్థలో చిన్న చిన్న మార్పులు రావాలన్నారు. వైట్ కార్డ్ ఉన్న వాళ్లకు ఓటు హక్కు రద్దు చేయాలన్నారు. రేషన్ కార్డు కావాలంటే ఓటు హక్కు కోల్పోతావని చెప్పాలి.. అప్పడు ఏది అవసరమో అదే తీసుకుంటారని పూరి పేర్కొన్నారు. అప్పుడు నిజంగా కష్టంలో ఉన్నవాడు మాత్రమే వైట్ కార్డ్ తీసుకుంటాడని పూరి వెల్లడించారు. రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఇవ్వకూడదని.. పేదోడు ఏ కులంలో ఉన్నా సపోర్ట్ చేయాలన్నారు.

నిరక్షరాస్యులకు ఓటు హక్కు తీసివేయాలని పూరి పేర్కొన్నారు. ఓటు వేయడానికి క్వాలిఫికేషన్‌ను పెట్టాలన్నారు. పుట్టాం కదా గుద్దేస్తాం అంటే కుదరదని.. ఓటు హక్కును అందరూ సంపాదించుకోవాలన్నారు. ప్రభుత్వాలను, నేతలనూ అడుక్కోవడం మానేద్దామన్నారు. ప్రపంచంలో ఏ జంతువు మరే జంతువు దగ్గరా చేయి చాచదని... తిండి కోసం కష్ట పడుతుందని లేదంటే చస్తుందని పూరి తెలిపారు. జాతిని తిడితే కోపం వస్తుందని... కానీ అదే జాతిని కించపరుస్తూ పేదోడిలా ప్రభుత్వం ముందు నిలబడటం తప్పుకాదా? అని పూరి ప్రశ్నించారు. పూరి కామెంట్స్‌పై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.