పూరి విడుదల చేసిన 'ఇది మా ప్రేమకథ' ఫస్ట్ లుక్ పోస్టర్

  • IndiaGlitz, [Tuesday,March 14 2017]

పాపులర్ యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం "ఇది మా ప్రేమ కథ". మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా యువ ప్రతిభాశాలి అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు."ఇది మా ప్రేమ కథ" ఫస్ట్ లుక్ పోస్టర్ ను సెన్నేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నేడు (మార్చి 14) తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన పి.ఎల్.కె.రెడ్డి మాట్లాడుతూ.. "యాంకర్ రవిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ మేం నిర్మిస్తున్న ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ "ఇది మా ప్రేమ కథ" షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మా ఫస్ట్ లుక్ పోస్టర్ ని డైరెక్టర్ పూరి జగన్నాధ్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: రమేష్ కొత్తపల్లి, పాటలు: దినేష్ (నాని), సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి, సహనిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి, నిర్మాణం: మత్స్య క్రియేషన్స్, దర్శకత్వం: అయోధ్య కార్తీక్!!

More News

పూరితో అర్బాజ్ ఖాన్...

ఇప్పుడు బాలీవుడ్ నటుడు,దర్శక నిర్మాత అర్బాజ్ ఖాన్ పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

త్రివిక్రమ్ సినిమాలో పవన్ రోల్ ఎంటంటే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ అంటేనే ఓ క్రేజ్ నెలకొంటుంది.

'రోగ్ ' తో హీరోగా పరిచయం అవుతున్న హీరో ఇషాన్ పెద్ద స్టార్ గా ఎదుగుతాడు - వి.వి.వినాయక్

బద్రి,ఇడియట్,పోకిరి వంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ తో సెన్సేషనల్ హిట్ మూవీస్ చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో

విక్రమ్ సరసన కొత్త హీరోయిన్....

ఇంకొక్కడు సినిమా సక్సెస్ తర్వాత చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతోన్న

రజనీ '2.0' శాటిలైట్ రేట్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుందంతే...

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెర పై చూపించడానికి రెడీ అవుతున్నాడు.