close
Choose your channels

డేవిడ్ వార్నర్‌కు పూరీ అతిథి పాత్ర ఆఫర్..

Monday, May 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డేవిడ్ వార్నర్‌కు పూరీ అతిథి పాత్ర ఆఫర్..

కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీ వరకూ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు, ప్రముఖులు, సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు తమ అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య టాలీవుడ్ సినిమా రంగంపై మోజు ప్రదర్శిస్తున్నాడు. ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమాలోని ‘బుట్టబొమ్మ..’ పాటకు వార్నర్ దంపతులు టిక్ టాక్ వీడియో చేసిన విషయం తెలిసిందే. ఈ డ్యాన్స్‌పై బన్నీ స్పందించి వావ్ అన్నాడు. ఈ డ్యాన్స్ బన్నీ అభిమానులకు వార్నర్ గిఫ్ట్ అనుకోవచ్చేమో.!

బ్యాట్ చూపిస్తూ..!

అయితే.. తాజాగా మహేశ్ బాబును సూపర్ స్టార్‌గా చేసిన ‘పోకిరి’ చిత్రంలోని అదిరిపోయే డైలాగ్.. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ తనదైన స్టైల్‌లో బ్యాట్ చూపిస్తూ చెప్పాడు. సినిమాలో గన్.. ఇక్కడ బ్యాట్ అంతే తేడా. ఈ వీడియోను పోస్ట్ చేసి డైలాగ్ ఏ సినిమాలోదో కనుక్కోండి..? నేను అంతా వెతికాను కానీ నాకు దొరకలేదు..? అని కామెంట్ పెట్టాడు. దీంతో చాలా మంది మహేష్ బాబు ‘పోకిరి’ సినిమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి ‘పోకిరి’ సినిమా డైలాగ్స్ అంత ఈజీగా ఎవరూ మర్చిపోరు. ఈ సినిమాను తనదైన మార్క్‌తో పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. ఈ సినిమా డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయ్.

పూరీ-వార్నర్ చమత్కారం..

వార్నర్ వీడియోకు పూరీ రియాక్ట్ అయ్యాడు. వార్నర్ మీ నటన బాగుంది.. నా సినిమాలో ఓ అతిథి పాత్ర ఇస్తాను’ అని ఆఫర్ చేశాడు. ఇందుకు వెంటనే స్పందించిన వార్నర్.. ‘నేను కూడా ప్రయత్నిస్తున్నాను సర్. అయితే, సన్ రైజర్స్ ఫ్రాంచైజీ నన్ను వదులుకుంటుందో లేదో చూడాలి. లేకపోతే సన్ రైజర్స్ నుంచి నన్ను విడిపించేందుకు మీరే ఏదైనా బేరం కుదుర్చుకోవాలి’ అని చమత్కరించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణపై మహేశ్, వార్నర్, పూరీ అభిమానులు కామెంట్స్, లైక్‌లు, షేర్ల వర్షం కురిపించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos