close
Choose your channels

ఎన‌ర్జీలో అన్న‌య్య‌ని కొట్టేవాడు పుట్ట‌డు: పూరి జ‌గ‌న్నాథ్‌

Monday, September 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన‌ర్జీలో అన్న‌య్య‌ని కొట్టేవాడు పుట్ట‌డు:  పూరి జ‌గ‌న్నాథ్‌

భారీ అంచ‌నాలు న‌డుమ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా కోసం మెగాభిమానులు, ప్రేక్ష‌కులే కాదు.. సినీ ప్ర‌ముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `సైరా న‌ర‌సింహారెడ్`డి యూనిట్‌ను అభినందిస్తూ ఓ వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో చేశారు. ``చాలా ఏళ్ల క్రితం చర‌ణ్ నాతో డాడీతో ఓ మెమొర‌బుల్ మూవీ తీయ్యాలి. అంద‌రూ ఫ్రౌడ్‌గా ఫీల్ కావాలన్నాడు. సైరా టీజ‌ర్ చూశాను. చూడ‌గానే నాకు చ‌ర‌ణ్ గుర్తుకొచ్చాడు. ఆరోజు ఎలా చెప్పాడో ఈరోజు సినిమాను అలాగే తీశాడు. గ్రాండియ‌ర్‌గా, విజువ‌ల్‌గా సినిమాను నిర్మించాడు. సురేంద‌ర్ రెడ్డి ఇర‌గొట్టేశాడు. ఇక అన్న‌య్య గురించి.. ఎనర్జీలో అన్న‌య్య‌ను కొట్టేటోడు మ‌ళ్లీ పుట్ట‌డు. ల‌వ్ యు అన్న‌య్య‌. సైరా చాలా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అని ట్విట్ట‌ర్‌లో వీడియో పోస్ట్ చేశారు పూరి.

ఈ ఏడాది ఇస్మార్ట్ శంక‌ర్‌తో బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్ కొట్టిన పూరి జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో త‌దుప‌రి సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను పూరి ఇప్పుడు రెడీ చేస్తున్నాడట‌. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను పూరి, చార్మి నిర్మించ‌నున్నారు. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను సరికొత్త యాంగిల్‌లో పూరి ప్రెజంట్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.