close
Choose your channels

నిజమెంతో పూరియే చెప్పాలి?

Sunday, August 18, 2019 • తెలుగు Comments

నిజమెంతో పూరియే చెప్పాలి?

కొత్త హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేయ‌డంలో పూరి ముందుంటారు. ఆయ‌న‌కున్న పూరి క‌నెక్ట్స్ సంస్థ స‌హ‌కారంతో ముంబై హీరోయిన్స్‌ను తెలుగులోకి ప‌రిచ‌యం చేశారు. హీరోయిన్‌ను గ్లామ‌ర్‌గా, హాట్‌గా చూపించ‌డంలోనూ పూరి స్టైల్ డిఫ‌రెంట్‌. ఇప్పుడు పూరి స్టార్ బాలీవుడ్ హీరోయిన్‌ని టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆమె ఎవ‌రో కాదు..జాన్వీ క‌పూర్‌.

వివ‌రాల్లోకెళ్తే.. పూరి, విజ‌య్‌దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌బోయే సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాలో జాన్వీక‌పూర్‌ను హీరోయిన్‌గా న‌టింప‌చేయ‌డానికి పూరి టీమ్ ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే త‌మిళంలో అజిత్ చిత్రంలో జాన్వీక‌పూర్ న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ అమ్మ‌డు తెలుగులో న‌టిస్తుందా? ఇందులో నిజానిజాలేంటో పూరియే చెప్పాలి మ‌రి!.

Get Breaking News Alerts From IndiaGlitz