close
Choose your channels

బాలీవుడ్ హీరోతో పూరి..!

Tuesday, May 19, 2020 • తెలుగు Comments

బాలీవుడ్ హీరోతో పూరి..!

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా డైరెక్ట‌ర్‌గా త‌న‌దైన ముద్ర వేశాడు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌. స‌క్సెస్‌లే లేని స‌మ‌యంలో ఇస్మార్ట్ శంక‌ర్‌తో సెన్సేష‌న‌ల్ హిట్‌ను అందుకున్నాడు. వెంట‌నే పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి లైగ‌ర్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా.. ఈ సినిమాను హిందీలో క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తుండ‌టం విశేషం. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉండ‌గానే కరోనా ప్ర‌భావం సినీ ప‌రిశ్ర‌మ‌ను తాక‌డంతో పూరికి కావాల్సినంత స‌మ‌యం దొరికింది. ఈ స‌మ‌యంలో పూరి ఓ క‌థ‌ను త‌యారు చేయ‌డ‌మే కాకుండా బాలీవుడ్ హీరోకు క‌థ చెప్పి ఓకే చేయించుకున్నాడ‌ట‌.

పూరి జ‌గ‌న్నాథ్‌కు బాలీవుడ్‌లో సినిమా చేయ‌డ‌మేమీ కొత్త కాదు. ఎందుకంటే అమితాబ్‌తో బుడ్డా హోగా తేరా బాప్ సినిమాను తెరెక్కించి హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోసారి పూరి బాలీవుడ్ మూవీ చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఛార్మినే ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. క‌థ అద్భుతంగా కుదిరింద‌ని, త‌ప్ప‌కుండా బాలీవుడ్‌లో పూరికి మ‌రో హిట్ ప‌క్కా అని చెప్పింది. మ‌రి ఇంత‌కూ పూరి డైరెక్ట్ చేయ‌బోయే హీరో ఎవ‌రో తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz