Download App

పూరి వాస్కోడ‌గామా

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇటీవ‌ల త‌న కొడుకు ఆకాశ్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ మెహ‌బూబా అనే సినిమాను డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు పూరి కొడుకు కోసం వాస్కోడ‌గామా అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు.

అది కూడా స్వంత నిర్మాణ సంస్థ పూరి టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రానికి పూరి ద‌ర్శ‌కుడిగా కాకుండా నిర్మాత‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తార‌ట‌. అనిల్ పాడేరు అనే ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.