పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి టైటిల్ ఖ‌రారు

  • IndiaGlitz, [Thursday,August 22 2019]

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కానుందనే సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫైట‌ర్‌' అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను ఖ‌రారు చేశారు. రీసెంట్‌గా విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్'తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు పూరి జగన్నాథ్. ఈ తరుణంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ వంటి క్రేజీ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసుకుని జ‌న‌వ‌రి నుండి ఈ సినిమా సెట్స్ పై కి వెళ్ల‌నుంది. హీరోల‌ను మాస్ యాంగిల్‌లో తెర‌పై ప్రెజెంట్ చేసే పూరి జ‌గ‌న్నాథ్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు.

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల‌తో స్టార్ హీరో క్రేజ్ సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు నోటా, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాలు ఆశించిన మేర స‌క్సెస్‌ల‌ను అందించ‌లేక‌పోయాయి. ఎలాగైనా మ‌రో భారీ స‌క్సెస్ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిగా ఎదురుచ‌చూస్తున్న త‌రుణంలో పూరి క‌థ‌ను సిద్ధం చేయ‌డం.. ఆ క‌థ‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగిపోయాయి. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట‌లు స‌రిగ్గా రాని ఫైట‌ర్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డబోతున్నార‌ట‌. అస‌లే యూత్‌లో క్రేజ్ ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను పూరి ఎలా చూపిస్తాడోన‌ని ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది. ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ త‌ర్వాత సినిమాను వెంట‌నే స్టార్ట్ చేయ‌కుండా పూరి.. ఈసారి స్క్రిప్ట్ వ‌ర్క్ మీద కాస్త స‌మ‌యాన్ని కేటాయిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది. మ‌రో ప‌క్క విజ‌య్ ఈలోపు క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమాను పూర్తి చేసుకుంటాడు.

More News

ఇది ఇక్కడితో ఆగదు..  పిచ్చా.. శని అనుకోవాలా!?

పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టులో నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసిన విషయం విదితమే.

'పిహిల్వాన్' ట్రైల‌ర్ విడుద‌ల‌... సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్‌

శాండిల్ వుడ్ బాద్షా..`ఈగ` ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `ప‌హిల్వాన్‌`. ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు.

శివ కంఠమనేని హీరో గా ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా

‘అక్కడొకడుంటాడు’తో శివ కంఠమనేని నటుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు.

ఏపీ హైకోర్టులో జగన్‌ సర్కార్‌కు ఊహించని షాక్

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన ‘పోలవరం’ రివర్స్ టెండరింగ్‌ వేసి తీరుతామని జగన్ సర్కార్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే.

విశాల్ పెళ్లి ఆగిపోయిందా?

తెలుగువాడైన కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి ఆగిపోనుందా? అంటే అవునని గుస‌గుస‌లు వినిపించాయి.