close
Choose your channels

'శమంతక మణి' పెద్ద హిట్ కావాలి - పూరి జగన్నాథ్

Tuesday, July 4, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నారా రోహిత్‌, సుధీర్ బాబు, సందీప్ కిష‌న్‌, ఆది హీరోలుగా భ‌వ్య క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తున్న చిత్రం `శ‌మంత‌క‌మ‌ణి`. చాందిని చౌద‌రి, జెన్ని హ‌నీ నాయిక‌లు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. వి. ఆనంద‌ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో సోమ‌వారం జ‌రిగింది. పూరి జ‌గ‌న్నాథ్ సీడీల‌ను విడుద‌ల చేశారు.

అనంతరం పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ .. సందీప్‌, ఆది, సుధీర్‌బాబు, నారా రోహిత్‌.. న‌లుగురూ స్టార్లే. ఇది మ‌ల్టీస్టార‌ర్ సినిమా. ఈ నలుగురిలో ముందు ఎవ‌రు డేట్లు ఇస్తే వారితో సినిమా చేస్తాను. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారితో ప‌నిచేసే అవ‌కాశం కోసం వెయిట్ చేస్తున్నాను. `శ‌మంత‌క‌మ‌ణి` ఫంక్ష‌న్‌కి ర‌మ్మ‌ని బాల‌య్య‌గారు చెప్పారు. కానీ ఆయ‌న‌కు చిన్న ఫుడ్ పాయిజ‌న్ కావ‌డం వ‌ల్ల రాలేక‌పోయారు. ఆయన్ని `పైసా వ‌సూల్` ఫంక్ష‌న్‌లో క‌లుద్దాం. `శ‌మంత‌క‌మ‌ణి` ట్రైల‌ర్ చాలా బావుంది. ఎన‌ర్జ‌టిక్‌గా ఉంది. శ్రీరామ్ చాలా బాగా తీశాడు. సినిమా పెద్ద హిట్ కావాలి. ఆనంద‌ప్ర‌సాద్‌గారు చాలా మంచి నిర్మాత అని తెలిపారు. యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

40 ఏళ్లు సినిమాల్లో ప‌నిచేసిన నాకు శమంత‌క‌మ‌ణి ఒక అంద‌మైన క‌ల‌. న‌లుగురు హీరోలూ ఎవ‌రికి వారే హీరో అని కొట్ట‌కునేంత గొప్ప‌గా ద‌ర్శ‌కుడు శ్రీరామ్ క‌థ రాశారు. హీరోలు నాతో చాలా బాగా క‌లిసిపోయారు. ఈ చిత్ర నిర్మాత టేస్ట్ ఉన్న వ్య‌క్తి. అన్నే ర‌వి చాలా క‌ష్ట‌ప‌డ్డారు. స‌మీర్ అంద‌మైన కెమెరాను చేశారని రాజేంద్ర ప్ర‌సాద్ చెప్పారు.

ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ఈ క‌థ రాసుకునేట‌ప్పుడు ఉద్యోగం మానేయ‌డంతో మా నాన్న నాకు ఆరు నెల‌లు జీతం ఇచ్చారు. మా అమ్మ నాకు ధైర్యం ఇచ్చింది. నేను ఫ‌స్ట్ రాసుకున్న క‌థ‌లోనే న‌లుగురు హీరోలు అని అనుకున్నా. శ్రీరామ్ నాకు చాలా మంచి ఫ్రెండ్‌. త‌ను నాకు చాలా హెల్ప్ చేశాడు. నేనెంత ఎగ్జయిట్ అయ్యానో మా నిర్మాత అంత గొప్ప‌గా ఎగ్జ‌యిట్ అయ్యారు. మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నేర‌విగారికి చాలా థాంక్స్. మా షూటింగ్‌లో ఎప్పుడూ ఎనిమిది క్యార‌వ్యాన్‌లు ఉండేవి. అంత‌మందిని మేనేజ్ చేశారు అన్నేర‌విగారు. మా హీరోలంద‌రూ నాకు సోద‌రులు లాంటివారు. ఆదికి చాలా గొప్ప ఎనర్జీ ఉంటుంది. సందీప్ కి, నాకూ చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సుదీప్‌గారు చాలా ఫోక‌స్‌గా ఉంటారు. చాలా ప్యాష‌నేట్‌గా ఉంటారు. త‌న‌ని చూస్తే మ‌న ఎనర్జీ లెవ‌ల్స్ డ్రాప్ అయినా, వెంట‌నే పెరుగుతాయి.. రాజేంద‌ప్ర‌సాద్‌గారితో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ మెమ‌ర‌బుల్ ఫిల్మ్ ఫ‌ర్ మి. రాజేంద‌ప్ర‌సాద్‌గారు ఓ గొప్ప లెజెండ్‌. మా సినిమాలో హీరో , హీరోయిన్లు ఉండ‌రు. అంద‌రూ క్యార‌క్ట‌ర్లే ఉంటారు. నేను సినిమా చూశా. చాలా బాగా వ‌చ్చింది. అంద‌రికీ త‌ప్ప‌క న‌చ్చుతుందన్నారు.

మా ద‌ర్శ‌కుడే ఈ సినిమాకు హీరో. చాలా బాగా తీశాడు. డ‌బ్బింగ్ చెప్పేట‌ప్పుడు ఎగ్జ‌యిట్ అయ్యాను. మిగిలిన హీరోల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా హ్యాపీ. న‌లుగురుం ఎక్క‌డా ఇగోల‌కు పోలేదు. `ల‌వ్ లీ` త‌ర్వాత రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారితో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీ. చాందిని నాకు పెయిర్‌గా చేసింది. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం గ్రేట్‌గా కుదిరింది. చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. స‌మీర్‌గారు చాలా స్పీడ్ అయిన వ్య‌క్తి. ఆయ‌న‌తో మ‌ర‌లా ప‌నిచేయాల‌ని అనిపించిందద‌ని హీరో ఆది చెప్పారు. న‌లుగురు హీరోలు క‌లిస్తే స‌ర‌దాగా షూటింగ్ చేసుకోవ‌చ్చు అని చెప్ప‌డానికి `శ‌మంత‌క‌మ‌ణి` మంచి ఉదాహ‌ర‌ణ‌. చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తూ పెరిగిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారి నుంచి చాలా నేర్చుకున్నాను. సుధీర్ నాకు క్లోజ్ ఫ్రెండ్‌. హార్డ్ వ‌ర్క్ అనే విష‌యాన్ని ఇష్ట‌ప‌డ‌తాడు. రోహిత్ సెన్సిబిలిటీస్ అంటే నాకు ఇష్టం. ఆది నాకు ఎప్ప‌టినుంచో ఫ్రెండ్‌. ఈ సినిమాతోత‌న‌తో ప‌నిచేయ‌డం కుదిరింది. నిర్మాత‌గారు మా అంద‌రినీ స‌మానంగా చూసుకున్నారు. నా పాత్ర‌ను సినిమాలో చూస్తేనే న‌చ్చుతుందని హీరో సందీప్ కిష‌న్ తెలిపారు.

నారా రోహిత్ మాట్లాడుతూ.. ఇందులో అంద‌రం మంచి పాత్ర‌లు చేశాం. త‌ప్ప‌కుండా హీరో శ్రీరామ్ ఆదిత్య‌. మంచి క‌థ‌ను తీసుకొచ్చి మాతో చేయించారు. ఇలాంటి సినిమాను నిర్మించిన ఆనంద‌ప్ర‌సాద్‌గారికి థాంక్స్. స‌మీర్‌రెడ్డిగారితో ఫ‌స్ట్ టైమ్ చేశా. విజువ‌ల్స్ చాలా బావున్నాయి. మ‌ణిగారితో ఇది నా మూడో సినిమా. ఈ సినిమాకు మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. పూరిగారు బాల‌య్య‌బాబుగారితో ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేసేవాడిని. ఈ సినిమాకు పైసా వ‌సూల్ కావాలి. `పైసా వ‌సూల్‌`కి ప‌దింత‌లు డ‌బ్బులు రావాలి`` అని నారా రోహిత్ అన్నారు.

సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ఇందులో నేను త‌ల్లి లేని అబ్బాయిలాగా న‌టించా. నిర్మాత చాలా ఇష్టంగా సినిమా చేశారు. అన్నేర‌విగారంటే ఆనంద‌ప్ర‌సాద్‌గారికి ఓ న‌మ్మ‌కం. ఆనంద‌ప్ర‌సాద్‌గారంటే అన్నేర‌వికి ఓ గౌర‌వం. ఇద్ద‌రూ క‌లిసి చేసిన సినిమా పెద్ద హిట్ కావాలి. `శ‌మంత‌క‌మ‌ణి` అనే కారు కోసం అంద‌రూ సినిమా చూడాలి అని సుధీర్‌బాబు అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులు యూనిట్ స‌భ్యుల‌ను అభినందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.