మ‌హేశ్‌పై పూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • IndiaGlitz, [Friday,July 19 2019]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌.. ఈ టైటిల్‌లో సూప‌ర్‌స్టార్ అనే ఇమేజ్ మ‌హేశ్‌కు రావ‌డానికి కార‌ణ‌మైన ద‌ర్శ‌కుడెవ‌రైనా ఉన్నారా? అంటే ట‌క్కున వ‌చ్చే స‌మాధానం పూరి జ‌గ‌న్నాథ్‌. మ‌హేశ్‌, పూరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి చిత్రం 'పోకిరి'. బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. రెండో చిత్రం బిజినెస్‌మేన్ కూడా సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. అయితే అప్ప‌టి నుండి పూరి, మ‌హేశ్‌తో 'జ‌న‌గ‌ణ‌మ‌న‌' సినిమా చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నాలే చేస్తూ వ‌స్తున్నాడు. కానీ ఏవీ వ‌ర్క‌వుట్ కాలేదు. పూరికి కూడా ఈ మ‌ధ్య స‌క్సెస్ లేదు. అయితే రీసెంట్‌గా విడుద‌లైన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' పూరి హిట్ కొట్టాడు.

ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత పూరి ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతున్నారు. ఆ సంద‌ర్భంలో మ‌హేశ్ గురించిన ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. అప్పుడు పూరి గ‌ట్టిగానే మ‌హేశ్‌కు పంచ్ ఇచ్చారు. ''మ‌హేశ్ అభిమానులు చాలా మంది 'జ‌న‌గ‌ణ‌మ‌న‌' ఆయ‌న‌తో చేయ‌మ‌ని అన్నారు. కానీ నేను హిట్స్‌లో ఉంటేనే మ‌హేశ్ నాతో సినిమా చేస్తాడు. కాబ‌ట్టి నాకు ఆయ‌న‌కంటే ఆయ‌న అభిమానులంట‌నే ఇష్టం. ఎందుకంటే మ‌హేశ్‌కు రెండు మంచి సినిమాలు ఇచ్చాన‌ని వారి న‌మ్మ‌కం' అన్నారు. 'మ‌రిప్పుడు 'ఇస్మార్ట్ శంక‌ర్‌'తో హిట్ కొట్టారుగా మ‌హేశ్, ఇప్పుడు మీతో సినిమా చేస్తారేమో' అని యాంకర్ అంటే 'నేను ఎస్ చెప్ప‌డానికి నాకంటూ ఓక్యారెక్ట‌ర్ ఉంటుందిగా' అని పూరి ఇన్‌డైరెక్ట్‌గా మ‌హేశ్‌తో సినిమాలు చేయ‌న‌ని చెప్పేలా స‌మాధానం ఇచ్చారు.

More News

చిత్రీకరణ పూర్తిచేసుకున్న'ధమ్కీ'

శ్రీమతి ఆదిలక్ష్మి, భాస్కర రావు  సమర్పణలో  సుంకర బ్రదర్స్ పతాకంపై సత్యనారాయణ సుంకర నిర్మాత గా తెరకెక్కిన చిత్రం ధమ్కీ..

డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లో 'తోలుబొమ్మ‌లాట‌' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్‌, హ‌ర్షిత‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `తోలుబొమ్మ‌లాట‌`.

బీజేపీకి టచ్‌లో మాజీ సీఎం.. బాంబ్ పేల్చిన ఏపీ ఎమ్మెల్సీ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపిన విషయం విదితమే.

అల్లువారి రిసెప్ష‌న్‌లో మెగా ఫ్యామిలీ.. గ్రాండ్ సక్సెస్!!

టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నయ్య బాబీ రెండో వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్.. కేసీఆర్ సంచలన ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గులాబీబాస్, సీఎం కేసీఆర్ పలు సంచలన ప్రకటనలు చేశారు.