Pushpa The Rule:ఈసారి అసలు తగ్గేదేలే.. 'పుష్ప పుష్ప' సాంగ్ అదిరిపోయింది..

  • IndiaGlitz, [Wednesday,May 01 2024]

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప2 మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. 'పుష్ప పుష్ప' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ఫ్యాన్స్‌ను ఉర్రుతులూగించేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్‌, టీజర్ అభిమానులకు పూనకాలు తెప్పించగా.. ఇప్పుడు లిరికల్ సాంగ్ కూడా అదరగొడుతోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రాసద్ అదిరిపోయే బాణీలు ఇచ్చాడు. దీంతో సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసందే. ఈ టీజర్‌లో తిరుపతి గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ అమ్మవారిలా ఉగ్రరూపంతో చేస్తున్న ఫైట్‌ అదిరిపోయింది. టీజర్‌లోనే బన్నీ విశ్వరూపం కనపడటంతో సినిమాలో మాస్ జాతరే ఉండనుందని తెలుస్తోంది. ఈ జాతర సాంగ్ కూడా అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని చెబుతున్నారు. కాగా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మూవీ విడుదల కానుంది.

ఇదిలా ఉంటే 'పుష్ప2' సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇటీవలే వైజాగ్‍లో షెడ్యూల్ పూర్తవ్వగా.. ప్రస్తుతం హైదరాబాద్‍లో షూటింగ్ జరుగుతోంది. భారీస్థాయిలో యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‍గా చేస్తున్నారు. వీరితో పాటు జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రామేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇక పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడు. దీంతో బన్నీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. దుబాయ్‌లోని మ్యూజియంలో ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని బన్నీ స్వయంగా ఆవిష్కరించారు. 'అలవైకుంఠపురంలో' మూవీలోని కాస్ట్యూమ్‌తో 'పుష్ప' మూవీలోని తగ్గేదేలే మేనరిజంతో ఈ విగ్రహం తయారుచేశారు. కాగా పుష్ప2 తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయనున్నాడు.

More News

TDP:తెలుగుదేశం మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు

దేశంలో నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. భగభగ మండే ఎండలు ఓవైపు..

Telangana: తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. బరిలో ఎంతమంది ఉన్నారంటే..?

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 525 మంది అభ్యర్థులు

Sharmila:ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా..? సీఎం జగన్‌కు షర్మిల సవాల్

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో బహిరంగ లేఖ రాశారు.

Janasena:గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టులో జనసేనకు స్వల్ప ఊరట

స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై జనసేన పార్టీకి హైకోర్టులో కాస్త ఊరట లభించింది.

Vaishnav Tej:పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ ప్రచారం

ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌