ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రెడీ అవుతున్న ‘‘పుష్ప’’.. ఇక ప్రమోషన్స్‌లో దూకుడే..!!!

  • IndiaGlitz, [Wednesday,November 24 2021]

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి పార్ట్‌ని ‘‘పుష్ప ది రైజింగ్ ’’ పేరిట డిసెంబ‌ర్ 17న మూవీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్లు, పోస్టర్స్, లుక్స్, పాటలు అంచనాలను పెంచేశాయి. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిద్ భైర‌వ్ సింగ్ షెకావ‌త్ అనే ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అల్లు అర్జున్, పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో, ర‌ష్మిక మంద‌న్న... శ్రీవ‌ల్లి అనే పాత్ర‌ను పోషిస్తున్నారు. 1980లలో చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగిన ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

డిసెంబ‌ర్ 17కు సమయం దగ్గరపడుతున్నప్పటికీ.. ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోకపోవడంతో అభిమానులు బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. ఏవో రెండు పాటలు, సునీల్, అనసూయల క్యారెక్టర్‌లకు సంబంధించిన పోస్టర్లు తప్పించి ఇంత వ‌ర‌కు టీజ‌ర్‌, ట్రైలర్స్ విడుద‌ల చేయ‌క‌పోవడంతో ఈ సినిమా రిలీజ్‌పై టాలీవుడ్‌లో కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. బన్నీ ఫ్యాన్స్ సైతం పుష్ప యూనిట్‌ను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై మేకర్స్ స్పందించినట్లుగా వుంది. దీనిలో భాగంగానే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు.

అయితే ఈ ట్రైలర్‌ను సింపుల్ సోషల్ మీడియాలోనో.. లేదంటే యూట్యూబ్‌లోనో వదిలేయకుండా.. అల్లు అర్జున్ రేంజ్‌కి తగ్గట్టుగా ఒక వేదిక ద్వారా వదలడమే మంచిదనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారట. అందుకే డిసెంబర్ 2వ తేదీన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలనే ఆలోచనలో వున్నట్లుగా ఫిలింనగర్ టాక్. తెలుగుకు సంబంధించి ఆ రోజున ఇక్కడ ఈవెంట్‌ను జరిపేసి, ఆ తరువాత మిగిలిన భాషల్లోను ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలన్నది నిర్మాతల ప్లాన్‌గా తెలుస్తోంది. మరి ఏం జరగనుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్‌కు కెప్టెన్సీ ఇక లేనట్లే.. అంతా శ్రీరామ్‌ వల్లే, బాత్‌రూమ్‌లో కన్నీళ్లు

రోజులు గడిచేకొద్ది బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ మరింత ఉత్కంఠగా మారుతోంది.

రెజీనా క‌సాండ్ర ‘బ్రేకింగ్ న్యూస్’ షూటింగ్ ప్రారంభం

రెజీనా క‌సాండ్ర‌, సుబ్బ‌రాజు, జె.డి.చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’ .

ఇలాంటి జానర్‌లో ఇదే నా బెస్ట్ వర్క్ అవుతుంది - ‘అఖండ’ ప్రమోషన్స్‌లో తమన్

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

‘తగ్గేదే లే’ సినిమా నుండి దివ్యా పిళ్లై ఫస్ట్ లుక్ విడుదల

టాలీవుడ్‌లో భద్ర ప్రొడక్షన్స్ అతి పెద్ద నిర్మాణసంస్థగా అవతరించబోతోంది. విభిన్న చిత్రాలను భారీ బడ్జెట్‌లో నిర్మించేందుకు రెడీ అవుతోంది.

నాని చేతుల మీదుగా విడుద‌లైన ‘జయమ్మ పంచాయితీ’ నుంచి ‘తిప్పగలనా’ పాట

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోత్నారు.