'పుష్పక విమానం' నవంబర్ 12న విడుదల

  • IndiaGlitz, [Tuesday,September 28 2021]

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం పుష్పక విమానం రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘దొరసాని’’, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' చిత్రాల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న పుష్పక విమానం సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

పుష్పక విమానం చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు. పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన పుష్పక విమానం టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 12న సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించింది. పుష్పక విమానం చిత్రంలోని కళ్యాణం కమనీయం పాట ఇప్పటికే సూపర్ హిట్టయి సినిమాకు ఆకర్షణగా నిలించింది.

రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా డైరెక్టర్ దామోదర మాట్లాడుతూ...పుష్పక విమానం ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపిస్తారు. ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామా ని గుర్తుచేస్తూ , పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుంది . ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. నవంబర్ 12న థియేటర్లలో కలుసుకుందాం అన్నారు

More News

‘రిప‌బ్లిక్‌’ మూవీని డైరెక్ట‌ర్‌గా నా విజ‌న్‌తో తెర‌కెక్కించ‌డానికి హీరో సాయితేజ్ ఓ సైనికుడిలా స‌పోర్ట్‌గా నిల‌బ‌డ్డాడు - డైరెక్ట‌ర్ దేవాక‌ట్టా

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. దేవ క‌ట్టా ద‌ర్శ‌కుడిగా జీ స్టూడియోస్‌ సమర్పణలో

ఆన్‌లైన్‌లోకి సమంత... ఏం బాంబు పేలుస్తారో, ఈ రోజు సాయంత్రం రెడీగా ఉండండి..!

సమంత.. సమంత.. సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియాలో, తెలుగు చిత్ర సీమలో ఎక్కడ చూసినా ఈమే పేరే గట్టిగా వినిపిస్తోంది.

'వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే' : పోసానికి తన స్టైల్లో కౌంటరిచ్చిన పవన్

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌లో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఏపీలోని వైఎస్ జగన్‌ సర్కార్‌‌పై చేసిన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ 5 తెలుగు: ముగ్గురికి రవి క్షమాపణలు... ప్రియపై రంకేలేసిన లోబో, ఈవారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే

బిగ్‌‌బాస్ 5 తెలుగు విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. నిన్న లహరి ఎలిమినేషన్‌తో

తనిష్క్ రెడ్డి సమర్పిస్తోన్న ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ ‘ప్రొడక్షన్ నెం.1’ చిత్రం ప్రారంభం

తనిష్క్ రెడ్డి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై తనిష్క్ రెడ్డి, అంకిత సాహు హీరోహీరోయిన్లుగా