తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేసిన‌ పివిపి

  • IndiaGlitz, [Thursday,May 19 2016]

మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించింది. కుటుంబాలన్నీ కలిసి ఉండటం వల్ల కలిగే కుటుంబ విలువలు, మన సంస్కృతిని తెలియజేసే చిత్రమే ఈ బ్రహ్మోత్సవం. ఇటువంటి సినిమా ఆవశ్యకతను గుర్తించి పివిపి కోరిక మేర ప్రత్యేక‌ షోలు ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత పివిపి స్పందిస్తూ... కుటుంబ సభ్యులందరూ ఈ వేసవిలో ఈ చిత్రాన్ని చూసే అవకాశాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం క‌ల్పించింది. అందుకు మహేష్ బాబు ఫ్యాన్స్ తరపున, పివిపి సినిమా నిర్మాణ సంస్థ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావుగారు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రాజీవ్ త్రివేదిగారికి ధన్యవాదాలు చేస్తున్నాం అన్నారు.

More News

మా అంద‌రి క‌న్నా ఎక్కువ క‌ష్ట‌ప‌డి నిహారిక మంచి పేరు తెచ్చుకుంటుంది అని నా గ‌ట్టి న‌మ్మ‌కం - రామ్ చ‌ర‌ణ్

మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నకొణిద‌ల‌ నిహారిక న‌టించిన తొలి చిత్రం ఒక మ‌న‌సు. ఈ చిత్రంలో నాగ శౌర్య - నిహారిక జంట‌గా న‌టించారు.

థియేటర్స్ కు పండుగను తీసుకొస్తున్న 'బ్రహ్మోత్సవం'

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పివిపి సినిమా, ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్స్ పై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఈనెల  20న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం గ్రాండ్ గా  రిలీజ్ అవుతుంది.

జెంటిల్ మ‌న్ ఆడియో కాంటెస్ట్

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం జెంటిల్‌మ‌న్‌. ఈ చిత్రానికి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అష్టా చమ్మా తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత  నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చిత్ర‌మిది.

యాక్షన్ ఎంటర్ టైనర్ లో మంచు విష్ణు...

ఈడోరకం ఆడోరకం సక్సెస్ తో మంచి ఊపు మీదున్న మంచు విష్ణు ఇప్పుడు ఓ యాక్షన్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ వద్ద వర్క్ చేసిన రమేష్ దేశిన దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుందట.

అ ఆ రిలీజ్ డేట్ మ‌ళ్లీ మారిందా..

యువ హీరో నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అ ఆ. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న స‌మంత న‌టించింది.