పోలీసులపైకి కుక్కలను వదిలిన పీవీపీ

  • IndiaGlitz, [Monday,June 29 2020]

నేడు వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ)ని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపైకి కుక్కలను వదలడం సంచలనంగా మారింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో జరిగిన గొడవ కేసులో పీవీపీని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లారు. పోలీసులను చూసిన పీవీపీ తన పెంపుడు కుక్కలను వారిపైకి వదలడంతో భయంతో వారు వెనుదిరగాల్సి వచ్చింది. పీవీపీ నిర్వాకంపై ఎస్సై హరీష్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీవీపీపై ఐపీసీ 353 కింద మరో కేసు నమోదు చేశారు.

కాగా.. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 14లో ‘ప్రేమ్‌ పర్వత్‌ విల్లాస్‌’ పేరిట పీవీపీ కొన్ని నిర్మాణాలు చేశారు. వీటిలో ఓ విల్లాను విక్రమ్ కైలాష్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. తాజాగా ఆయన తన విల్లాలో ఇంటీరియర్ డెకరేషన్‌ చేయించుకుంటుండగా అక్కడకు వెళ్లిన పీవీపీ తన విల్లాలో అలాంటివేమీ చేయించడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించారు. విల్లాలోని సామాగ్రినంతా ధ్వంసం చేశారు. దీంతో విక్రమ్ బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో పీవీపీ, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశాడు. విచారణ నిర్వహించిన పోలీసులు నేడు పీవీపీని అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా కుక్కలను వదిలి వారిని భయబ్రాంతులకు గురి చేశారు.

More News

తెలంగాణలో సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలో సచివాలయం కూల్చివేత వివాదంలో హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరో మార్గం లేకే మీడియా ముందుకు వెళ్లా: జగన్‌కు రఘురామ లేఖ

వైసీపీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు.. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం.. పలు సందర్భాల్లో

పవన్‌ను మరోసారి టార్గెట్ చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేన పార్టీ అధినేత, పార్టీపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి టార్గెట్. జనసేనను పట్టించుకునేవారే లేరని..

తెలంగాణ లొకేష‌న్స్‌పై ద‌ర్శ‌క‌ధీరుడి ఆరా!!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఈ టెన్ష‌న్‌కు కార‌ణం క‌రోనా.

భీమవరం టాకీస్ ద్వారా త్వరలో OTT ప్రారంభం!

మారుతున్న టెక్నాలజీ తో మనం మారుదాం, సినిమా జీనియస్ రామ్ గోపాల్ వర్మ ఒక కొత్త మార్గాన్ని వెలికితీశారు.