ఊపిరి శాటిలైట్ రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన పి.వి.పి

  • IndiaGlitz, [Wednesday,April 13 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ కాంబినేష‌న్లో రూపొందిన ఊపిరి చిత్రం మూడ‌వ వారంలోను విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ముఖ్యంగా ఓవ‌ర్ సీస్ లో రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ తో టు మిలియ‌న్ మార్క్ కు ద‌గ్గ‌ర‌లో ఉండ‌డం విశేషం. ఇదిలా ఉంటే..ఊపిరి చిత్రం తెలుగు, త‌మిళ శాటిలైట్ రైట్స్ ను 14 కోట్లుకు అమ్మిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.
నాగార్జున చిత్రానికి తెలుగులో శాటిలైట్ రైట్స్ ప‌రంగా దాదాపు 8 కోట్లు వ‌స్తున్నాయి. అయితే త‌మిళ్ లో ఊపిరి చిత్రానికి శాటిలైట్ రైట్స్ ప‌రంగా 6 కోట్లు వ‌చ్చాయా..? అనే అనుమానం ఇండ‌స్ట్రీకి సంబంధించిన కొంత‌మంది వ్య‌క్తుల్లో ఏర్ప‌డింది. ఈ విష‌యం పై క్లారిటీ కోసం మీడియా పి.వి.పి సంస్థ‌ను సంప్ర‌దిస్తే...ఊపిరి శాటిలైట్ రైట్స్ ద్వారా 14 కోట్లు ద‌క్కించుకుంది అనే ప్ర‌చారం పుకారు అని తేల్చేసింద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఊపిరి తెలుగు, త‌మిళ్ శాటిలైట్ రైట్స్ ఎవ‌రికి ఇవ్వ‌లేద‌ని, ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని పి.వి.పి సంస్థ చెప్పంద‌ట‌. మ‌రి..ఊపిరి శాటిలైట్ రైట్స్ ద్వారా ప్ర‌చారంలో ఉన్న‌ట్టు 14 కోట్లు ద‌క్కించుకుంటుందో...అంత‌కు మించి ద‌క్కించుకుంటుందో చూడాలి.

More News

బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ డేట్ మారింది..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం.

మ‌హేష్‌తో ఒక‌లా.. తార‌క్‌తో మ‌రోలా..

మునుప‌టిలా వ‌రుస విజ‌యాల‌ను త‌న సొంతం చేసుకోలేక‌పోతున్న‌ప్ప‌టికీ.. భారీ బ‌డ్జెట్ మూవీ ఆఫ‌ర్ల‌ను పొందుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది స‌మంత‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న పెద్ద హీరోల సినిమాలంటే.. మ‌హేష్‌బాబుతో న‌టిస్తున్న 'బ్ర‌హ్మోత్స‌వం', ఎన్టీఆర్‌తో న‌టిస్తున్న 'జ‌న‌తాగ్యారేజ్‌'.

ఫస్ట్ ఫ్లాప్ తో ఆలోచనలో పడ్డ హీరో...

ఫస్ట్ ఫ్లాప్ తో ఆలోచనలో పడ్డ హీరో...ఎవరనుకుంటున్నారా..?హ్యాట్రిక్ హీరో రాజ్ తరుణ్.ఉయ్యాలా జంపాలా,సినిమా చూపిస్త మావ,కుమారి 21ఎఫ్..

స‌మంతకి త‌మ‌న్నా చెక్ పెట్ట‌నుందా?

ఓ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు స‌మంత‌నే మ‌హారాణి. మున్ముందు ఆ విష‌యంలో స‌ద‌రు చెన్నై పొన్నుకి చెక్ పెట్టేలా ఉంది త‌మ‌న్నా. ఇంత‌కీ అస‌లు విష‌య‌మేమిటంటే.. యుఎస్ లో టాప్ 10 గ్రాస‌ర్స్‌లో గ‌త కొంత కాలంగా హీరోయిన్ల జాబితాలో స‌మంత‌నే క్వీన్‌.

క‌ర‌ణ్ జోహార్ మూవీలో శ్వేతాబ‌సు

కొత్త బంగారులోకం చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్వేతాబ‌సు ప్ర‌సాద్.  తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించిన శ్వేతాబ‌సు అన‌తి కాలంలోనే మంచి న‌టిగా గుర్తింపు ఏర్ప‌రుచుకుంది.