భారతీయ మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో బిగ్ డీల్.. పీవీఆర్‌లో విలీనం కానున్న ఐనాక్స్

  • IndiaGlitz, [Sunday,March 27 2022]

భారతదేశంలోని మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో దిగ్గజాలుగా పేరొందిన పీవీఆర్, ఐనాక్స్ ఒక్కటి కాబోతున్నాయి. ఈ మేరకు విలీన ఒప్పందానికి ఇరు సంస్థల బోర్డులు ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. విలీనానంతరం ఏర్పడే సంస్థకు పీవీఆర్‌ సీఎండీ అజయ్‌ బిజ్లీ ఎండీగా కొనసాగనున్నారు. ఇదే సంస్థకు చెందిన సంజీవ్‌ కుమార్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. అలాగే ఐనాక్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ పవన్‌ కుమార్‌ జైన్ బోర్డు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా, సిద్ధార్థ్‌ జైన్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ నాన్‌-ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉండనున్నారు.

అయితే ఈ ఒప్పందానికి ఇంకా పీవీఆర్‌, ఐనాక్స్‌ షేర్‌హోల్డర్ల ఆమోదం లభించాల్సి ఉంది. అలాగే స్టాక్ ఎక్స్ఛేంజీలు, సెబీ, సీసీఐ నుంచి కూడా అనుమతి రావాల్సి వుంది. ఇవన్నీ కార్యరూపం దాల్చిన పక్షంలో పీవీఆర్‌లో ఐనాక్స్‌ విలీనం అవుతుంది. అంతేకాదు ఐనాక్స్‌ షేర్‌ హోల్డర్లందరికీ పీవీఆర్‌ షేర్లు లభించనున్నాయి. విలీనానంతర ఏర్పడే సంస్థను ‘‘పీవీఆర్‌ ఐనాక్స్ లిమిటెడ్‌’’గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

కొత్తగా ఏర్పడే సంస్థలో పీవీఆర్‌ ప్రమోటర్లకు 10.62 శాతం వాటా, ఐనాక్స్‌ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా లభించనుంది. దేశవ్యాప్తంగా పీవీఆర్‌కు 73 పట్టణాల్లో 181 ప్రాంతాల్లో 871 తెరలు వుండగా... ఐనాక్స్‌కు 72 పట్టణాల్లోని 160 ప్రాంతాల్లో 675 స్క్రీన్‌లున్నాయి. విలీనానంతరం దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ ఎగ్జిబిషన్‌ కంపెనీగా పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌ అవతరించనుంది. తద్వారా కొత్త సంస్థకు దేశవ్యాప్తంగా 109 పట్టణాల్లో 341 ప్రాంతాల్లో 1,546 తెరలు వుంటాయి. పీవీఆర్‌కు దేశంలోని ఉత్తర, పశ్చిమ, దక్షిణ ప్రాంతంలో బలమైన నెట్‌వర్క్‌ ఉండగా.. ఐనాక్స్‌కు తూర్పు ప్రాంతంలో స్క్రీన్‌లు వున్నాయి.

More News

అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌ కార్లకు బ్లాక్ ఫిల్మ్ .. చలానా వేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

కేంద్ర మోటార్‌ వెహికిల్‌ చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు.

ఎప్పుడూ నా పక్కనే వున్నందుకు థ్యాంక్స్.. చరణ్‌కు ఎన్టీఆర్ బర్త్ డే విషెస్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇవాళ 38వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు .

అతడే నా గౌరవం.. చరణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి, ఫ్యాన్స్ కోసం అరుదైన ఫోటో

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇవాళ 38వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ పుట్టినరోజు ఆయనకు చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి.

మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉచిత రేషన్ పథకం పొడిగింపు, ఎన్ని నెలలంటే

కరోనా కారణంగా మనదేశంలో ఎలాంటి పరిస్దితులు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: లోయలో పడ్డ పెళ్లి బస్సు, 8 మంది దుర్మరణం .. మోడీ, జగన్ దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు.