రా రాజా.. ఓ అద్భుతమైన ప్రయోగం


Send us your feedback to audioarticles@vaarta.com


త్వరలోనే రిలీజ్ కాబోతున్న సినిమా రా రాజా. శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఓ అద్భుతమైన ప్రయోగం చేశారు. నటీనటుల మొహాలు చూపించకుండా కథ-స్క్రీన్ ప్లే నడిపించిన సినిమా ఇది.
తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. సీనియర్ నిర్మాత-దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రయిలర్ చూస్తే, ఈ ప్రయోగం ఏంటనేది క్లియర్ గా అర్థమౌతుంది. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ లో ఎక్కడా నటీనటుల ముఖాలు కనిపించవు. అలా అని ఆ ఫీలింగ్ కూడా రాదు. అదే ఈ సినిమా ప్రత్యేకత.
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. "రా రాజా మూవీ టైటిల్‌ను గమనిస్తే ఏదో ప్రేమ కథలా అనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో ఓ మొహం కూడా కనిపించదు. అసలు మొహాలు చూపించకుండా సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. డ్యూయెల్ అని స్పీల్ బర్గ్ తీసిన చిత్రంలోనూ మొహం కనిపించదు. అలానే ఈ చిత్రంలోనూ మొహాలు కనిపించవని అంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రయోగం. ఇది కనుక సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది." అన్నారు.
మార్చి 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. శివప్రసాద్ డైరక్ట్ చేసిన రా రాజా మూవీకి రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామేన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments