రాశీఖ‌న్నాకు ఇదే తొలిసారి... ఎగ్జ‌యిట్ అవుతుంద‌ట‌

  • IndiaGlitz, [Wednesday,November 06 2019]

టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా అందచందాల‌తో వెండితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. మంచి గాత్రంతోనూ పాటలు పాడి అంద‌రినీ అల‌రిస్తుంటుంది. సింగ‌ర్‌గానూ కొన్ని సినిమాల్లోనూ రాశీ పాడిన సంగ‌తి తెలిసిందే. తాజాగా రాశీ మ‌రో డేర్ స్టెప్ తీసుకుంది. అదేంటంటే డ‌బ్బింగ్ చెప్ప‌డం తొలిసారిగా రాశీఖ‌న్నా త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని రాశీఖ‌న్నానే తెలియ‌జేసింది. తొలిసారి తాను డ‌బ్బింగ్ చెప్పుకున్నాన‌ని, ప్రేక్ష‌కుల ఎలా రిసీవ్ చేసుకుంటారోన‌ని ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాన‌ని రాశీ తెలియ‌జేసింది. ఈమె హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రాల్లో 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌' సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్‌.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథ‌రిన్ త్రెసా, ఇజాబెల్లె హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న చిత్ర‌మిది. దీని త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ 'హీరో' సినిమాలో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు సెన్సిబుల్ సినిమాలను తెర‌కెక్కించిన క్రాంతి మాధ‌వ్ తొలిసారి రొమాంటిక్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

More News

కొత్త లుక్ తో సర్ప్రైజ్ చేసిన శత్రు

'శత్రు' తెలుగులో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టులలో ఒకరు. "కృష్ణ గాడి వీర ప్రేమ కథ " తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శత్రు

‘పవన్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'నిశ్శ‌బ్దం' టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్‌

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు

ఇంకా విధుల్లో చేరని ‘ఎల్వీ’.. అసలేం జరుగుతోంది!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయిన సంగతి తెలిసిందే.

జగన్ కీలక నిర్ణయం.. ‘తెలుగు’కు కాలం చెల్లిపోయింది!?

అవును మీరు వింటున్నది నిజమే.. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ‘తెలుగు’కు కాలం చెల్లిపోనుంది.