కేథరిన్ బాటలో రాశి ఖన్నా

  • IndiaGlitz, [Friday,September 15 2017]

ఆగ‌స్టు 11, 2017.. ఈ తేది గ్లామ‌ర్ హీరోయిన్ కేథ‌రిన్ ట్రెసాకి ప్ర‌త్యేకం. ఎందుకంటే.. ఆ రోజున కేథ‌రిన్ కి సంబంధించిన రెండు తెలుగు సినిమాలు విడుద‌లయ్యాయి. ఆ రెండు చిత్రాలే నేనే రాజు నేనే మంత్రి, జ‌య‌జాన‌కి నాయ‌క‌. నేనే రాజు నేనే మంత్రిలో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌లో ఒక‌రిగా న‌టిస్తే.. జ‌య‌జానకి నాయ‌క‌లో ప్ర‌త్యేక గీతంలో మెరిసింది కేథ‌రిన్‌. వీటిలో నేనే రాజు నేనే మంత్రి హిట్ చిత్రంగా నిలిచింది. జ‌య‌జానకి నాయ‌క కి హిట్ టాక్ వ‌చ్చినా.. బ‌డ్జెట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు కేథ‌రిన్ బాట‌లోనే మ‌రో ముద్దుగుమ్మ ఒకే రోజు రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఆమె మ‌రెవ‌రో కాదు.. ఊహ‌లు గుస‌గుస‌లాడేతో కుర్ర‌కారుని క‌ట్టిప‌డేసిన రాశి ఖ‌న్నా. ఈ ముద్దుగుమ్మ న‌టించిన ఆక్సిజ‌న్ అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుండ‌గా.. ప్ర‌త్యేక గీతం చేసిన రాజా ది గ్రేట్ కూడా అదే రోజున రిలీజ్ కానుంది. మ‌రి ఈ రెండు చిత్రాలు రాశికి ఎలాంటి గుర్తింపు తీసుకువ‌స్తాయో తెలియాలంటే అప్ప‌టివ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

More News

త‌మ‌న్నా పోస్ట‌ర్ అదుర్స్

న‌ట‌న కంటే న‌ర్త‌న విష‌యంలోనే ఎక్కువ మార్కులు కొట్టేసిన క‌థానాయిక త‌మ‌న్నా. అందుకే ఆమెకి అప్పుడ‌ప్పుడు ప్ర‌త్యేక గీతం చేయ‌మ‌ని ఆఫ‌ర్లు వ‌స్తుంటాయి.

అక్టోబర్ లో 'శేఖరం గారి అబ్బాయి'

ఎం.ఎఫ్ క్రియేషన్స్ పతాకం పై అచ్చివర్స్ సిగ్నేచర్ బ్యానర్ లో హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు,

ప్రతిక్షణం మలుపులతో శ్రీవల్లి కొత్త అనుభూతినిస్తుంది: రాజ్ కుమార్

కథలోని కొత్తదనానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీయాలన్నదే నిర్మాతలుగా మా లక్ష్యం. నేటి ట్రెండ్‌కు తగ్గ జనరంజక చిత్రాల్ని నిర్మించాలన్నదే మా అభిమతం.

సైరా.. ఆ వార్త నిజమేనా?

ఖైదీ నెం.150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

3 నెలల గ్యాప్ లో సూపర్ స్టార్ 2 సినిమాలు

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలంటే..