close
Choose your channels

అక్కడ రాశి హవా!

Monday, January 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కడ రాశి హవా!

తెలుగులో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాశీ ఖన్నా ఇప్పుడు తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. ఈమధ్య ఆమె నటించిన రెండు సినిమాలు విజయం సాధించాయి. అంతే కాదు అక్కడి స్టార్ హీరోలందరితోనూ నటిస్తోంది. తొలి చిత్రంలోనే నయనతార, విజయ్‌సేతుపతి, అధర్వ వంటి స్టార్స్‌తో నటించే అవకాశం వరించడం, ఆ చిత్రం సక్సెస్ కావడంతో రాశీఖన్నా పేరు పాపులర్ అయింది.

అలాగే జయం రవితో కలిసి 'అడంగామరు' చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా విజయం సాధించడంతో రాశీ గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. 'ఇమైకానోడిగళ్' చిత్రంలో నటించినా నయనతార, విజయ్‌సేతుపతిలతో కలిసి నటించే అవకాశం లేకపోవడం బాధాకరమేనంది. అయితే విజయ్‌సేతుపతికి జంటగా నటించాలని తాను కలలు కంటున్నానని చెబుతోంది రాశి.

ఇక నటుడు విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందిన తెరి, మెర్శల్ చిత్రాలను చూశానని, వారి కాంబినేషన్ అంటేనే యమ క్రేజ్ అని పేర్కొంది. ఆ కాంబినేషన్‌లో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నానని రాశీఖన్నా చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ విశాల్‌కు జంటగా `అయోగ్య`, సిద్ధార్థ్‌తో `సైతాన్ కా బచ్చా` చిత్రాల్లో నటిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.