ర‌వితేజ కోసం రాశీఖ‌న్నా స్పెష‌ల్..?

  • IndiaGlitz, [Wednesday,July 08 2020]

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం క్రాక్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు ర‌వితేజ‌. ఈ సినిమా త‌ర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా ట్రాక్ ఎక్క‌క ముందే డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశాడు. క్రాక్ త‌ర్వాత ర‌మేశ్ వ‌ర్మ‌, వ‌క్కంతం వంశీ సినిమాల‌ను ఒకేసారి స్టార్ట్ చేస్తాడా? లేక గ్యాప్ తీసుకోకుండా ఏక‌ధాటిగా రెండు సినిమాల‌ను పూర్తి చేస్తాడా? అనేది తెలియ‌డం లేదు. వీటి మ‌ధ్య‌లో త్రినాథ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశాడు. అయితే క్రాక్ త‌ర్వాత ర‌వితేజ ఏ సినిమా స్టార్ట్ చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

చంట‌బ్బాయ్ త‌ర‌హా కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తెర‌కెక్కిస్తార‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా ఇందులో న‌భా న‌టేశ్‌, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్స్‌గా న‌టించే అవ‌కాశం ఉంద‌ని కూడా టాక్ విన‌ప‌డుతోంది. కాగా.. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో ర‌వితేజ‌తో రాశీఖ‌న్నా కాలు క‌దుపుతుంద‌ని అంటున్నారు. గ‌తంలో ర‌వితేజ‌, రాశీఖ‌న్నా కాంబినేష‌న్‌లో బెంగాల్ టైగ‌ర్‌, ట‌చ్ చేసి చూడు చిత్రాలు రూపొందాయి. మ‌రి ర‌వితేజ సినిమాలో పాయల్ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌నుంద‌నే వార్త‌ల‌పై రాశీఖ‌న్నా ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

More News

నిర్మాత‌గా మారుతున్న చిరు కుమార్తె

మెగాస్టార్ చిరంజీవి కుంటుంబంలో ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ నిర్మాతగా మారి వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

వెంటిలేటర్‌పై సీనియర్ నటి జయంతి..

సీనియర్ నటి జయంతి ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై ఉన్నారు. కొంతకాలంగా జయంతి ఆస్తమాతో బాధపడుతున్నారు.

బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్

ముంబైకి చెందిన 13 ఏళ్ల బాలికను ఆమె ఫేస్‌బుక్ ఫ్రెండ్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

హరీషన్న స్పందించి యశోదాలో బెడ్ ఇప్పించారు: జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి

మంత్రి హరీష్‌రావును ప్రజల మనిషి అని అంతా భావిస్తుంటారు. ఎన్నో సందర్భాల్లో ఆయన చూపిన శ్రద్ధ, చొరవ ఆయనకు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురైంది.