సూర్య‌కు జోడీగా రాశీఖ‌న్నా

  • IndiaGlitz, [Monday,May 04 2020]

హీరో సూర్య త‌న 38వ చిత్రం శూర‌రై పోట్రు(ఆకాశం నీ హ‌ద్దురా)ని కరోనా ప్రభావం తగ్గిన తర్వాత విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలుజ‌రుగుతున్నాయి. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈలోపు సూర్య త‌న 39వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి ఓకే చెప్పేసిన సంగతి తెలిసిందే. డైరెక్ట‌ర్ హ‌రి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ చిత్రానికి ‘అరువా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ‘అరువా’ అంటే కత్తి అనే అర్థం వస్తుంది.

వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఆరో సినిమా ఇది. స్టూడియో గ్రీన్ ప‌తాకంపై జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీఖ‌న్నా న‌టించ‌నుంది. ఈ విష‌యాన్ని రాశినే సోష‌ల్ మీడియా చాట్‌లో అభిమానుల‌కు తెలియ‌జేసింది. రాశీఖన్నా ఇప్ప‌టికే త‌మిళంలో ఇమైకా నోడిగ‌ల్‌(అంజ‌లి సీబీఐ ఆఫ‌స‌ర్‌) సినిమాతో పాటు కొన్ని చిత్రాల్లోన‌టించింది. సుంద‌ర్.సి ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమాలో న‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళంలో మంచి బ్రేక్ లేని రాశీఖ‌న్నాకు హ‌రి సినిమా ఎలాంటి గుర్తింపు తెస్తుందో చూడాలి.

More News

నిఖిల్ పెళ్లి వాయిదా

హీరో నిఖిల్ పెళ్లి మ‌రోసారి వాయిదా ప‌డింది. ఈ విష‌యంపై ఆ హీరోనే ఇంట‌ర్వ్యూలో స్పందించారు. ఏప్రిల్ 16న నిఖిల్ డాక్ల‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు.

త‌మిళ హీరోతో మెగాడాట‌ర్‌

మెగా బ్ర‌ద‌ర్ త‌న‌య నిహారిక కొణిదెల ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. ఈమె చేసిన సూర్య‌కాంతం, అంత‌కు ముందే విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ కార్తీక్‌ల‌తో ఓ త‌మిళ సినిమాలో

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయ్!

కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ బయటపడినట్లే అని గత వారం రోజులుగా అనిపించినప్పటికీ.. రెండు మూడ్రోజులుగా కేసులను బట్టి చూస్తే మళ్లీ విజృంభిస్తోందని చెప్పుకోవచ్చు.

మందు బాబులకు జగన్ సర్కార్ భారీ షాక్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం ప్రభుత్వం.. తాజాగా మరోసారి 3.0 పేరుతో మే-17వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

ఏపీకి మరో ముప్పు.. దూసుకొస్తున్న భారీ తుఫాన్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విలయతాండవం చేస్తుండగా.. తాజాగా రాష్ట్రానికి మరో ముప్పు రాబోతోంది. ఏపీకి భారీ తుఫాన్ ముప్