close
Choose your channels

శ‌ర్వానంద్‌తో రాశీఖ‌న్నా...?

Tuesday, July 7, 2020 • తెలుగు Comments

శ‌ర్వానంద్‌తో రాశీఖ‌న్నా...?

డైరెక్ట‌ర్‌గా తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. ర‌వితేజ‌, సిద్ధార్థ్ స‌హా ప‌లువురు హీరోల‌ను క‌లిశాడు. అంతా ఓకే అవుతున్న త‌రుణంలో ప్రాజెక్ట్ ఆగుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు శ‌ర్వానంద్ హీరోగా సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని టాక్ వినపడుతుంది. శర్వానంద్ జతగా సమంత నటిస్తుందని ఆ మ‌ధ్య వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే స‌మంత ప‌క్కకు త‌ప్పుకుంది. దీంతో సాయిప‌ల్ల‌వికి అజ‌య్ భూప‌తి క‌థ‌ను వినిపించాడ‌ట‌. కానీ తాజా స‌మాచారం మేర‌కు సాయిప‌ల్ల‌వి కూడా న‌టించ‌డం లేద‌ట‌. ఆ స్థానంలో శ‌ర్వానంద్ జోడీగా రాశీఖ‌న్నా న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

రాశీఖ‌న్నా విష‌యానికి వ‌స్తే.. గ‌త ఏడాది వెంకీమామ‌, ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రాల్లో న‌టించి స‌క్సెస్ కొట్టింది. ఈ ఏడాది వ‌ర‌ల్డ్‌ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌న మెప్పించే ప్ర‌య‌త్నంచేసినా...ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. ఇప్పుడు రెండు త‌మిళ చిత్రాల్లో న‌టించ‌డానికి ఓకే చెప్పింది. అందులో ఒక‌టి హీరో సూర్య‌, హ‌రి కాంబోలో రూపొంద‌నున్న అరువా చిత్రం కాగా.. మ‌రో చిత్రం సిద్ధార్థ్ హీరోగా న‌టిస్తున్న సైతాన్ కా బ‌చ్చా. మ‌రి ఈ సినిమాల్లో అరువా ప్రారంభం కావ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టేలానే క‌న‌ప‌డుతుంది.

Get Breaking News Alerts From IndiaGlitz