పొలిటిక్స్‌లోకి వస్తానంటున్న రాశీఖన్నా

  • IndiaGlitz, [Wednesday,December 09 2020]

ఉ్తతరాది ముద్దుగుమ్మ రాశీఖన్నా.. వరుస తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గరైంది. హీరోయిన్‌గా రాశీఖన్నా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి ఏడు వసంతాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు తెలుగు కంటే తమిళంలో ఈ చబ్బీ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయి. సినిమాల తర్వాత ఏం చేయాలనుకుంటున్నావని రీసెంట్‌గా కోలీవుడ్‌ మీడియా అడిగిన ప్రశ్నకు ఈ అమ్మడు చెప్పిన సమాధానం వింటే అబ్బో అనుకోవాల్సిందే.

చిన్నప్ప్పుడు ఐఏయస్‌ ఆఫీసర్‌ కావాలని అనుకునేదాన్ని అయితే అనుకోకుండా నటన రంగంలోకి అడుగుపెట్టాను. అయితే నేను తప్పకుండా ప్రజలకు సేవ చేస్తాను. అందు కోసం ముందుగా ఓ ఎన్టీఓ పెడతాను. వీలైతే రాజకీయాల్లోకి కూడా వస్తాను. నాకు రాజకీయాలు తెలియవు కానీ.. ప్రజలకు సేవ చేయడం తెలుసు అని రాశీఖన్నా చెప్పింది. రాశీఖన్నా ఇలా చెప్పడం చూస్తుంటే మీ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తుందనిపిస్తుంది. మరి ఆ తరుణమెప్పుడో తెలియాలంటే ఆగక తప్పేలా లేదు.

ఈ ఏడాది రాశీఖన్నా మెయిన్‌ హీరోయిన్‌గా చేసిన వరల్డ ఫేమస్‌ లవర్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. ఇప్పుడు సైతాన్‌ కా బచ్చా, తుగ్లక్‌ దర్బార్‌, అరణ్మణి చిత్రాలతో నటిస్తున్న రాశీఖన్నాను హీరోయిన్‌గా నటింప చేయడానికి మరికొంత మంది తమిళ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

More News

ఇంటర్నేషనల్‌ కంపెనీపై నాగ్‌ సెన్సేషనల్‌ ట్వీట్‌

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున, ఇంటర్నేషనల్ స్మార్ట్‌ మొబైల్‌ కంపెనీ యాపిల్‌పై సెన్సేషనల్‌ ట్వీట్‌ చేశాడు. "భారత్‌లో యాపిల్‌ స్టోర్స్‌ నుంచి యాపిల్‌ ప్రొడక్ట్స్ కొనేసమయంలో

డైరెక్టర్‌ శంకర్‌ను ఆకట్టుకున్న మూడు సినిమాలు

కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర శంకర్‌.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కమల్‌హాసన్‌తో భారతీయుడు 2ను స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే ఉంది.

చాలా గ్యాప్ తరవాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది!! - దర్శకుడు సుబ్బారావు గోసంగి

"అక్కడొకడున్నాడు, రాఘవరెడ్డి" చిత్రాలనంతరం ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైట్ హౌస్ సినీ మ్యాజిక్' ప్రొడక్షన్ నంబర్-3తో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారు

14న హైదరాబాద్‌కు రజినీకాంత్...

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ ఆరంగేట్రంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

బంగారు పుష్పాల గుట్టు రట్టుకు సిద్ధమైన దేవాదాయశాఖ..

శ్రీవారి బంగారు పుష్పాల గుట్టు రట్టు చేసేందుకు దేవాదాయశాఖ సిద్ధమైంది.