close
Choose your channels

వెంకీమామ‌లో రాశీ రోల్ ఇదే!

Sunday, July 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వెంకీమామ‌లో రాశీ రోల్ ఇదే!

వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌లిసి బాబీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం `వెంకీమామ‌`. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టిస్తోంది రాశీ ఖ‌న్నా. ఈ సినిమాలో ఆమె లుక్ గురించి రాశీ రివీల్ చేసింది. ``మ‌న‌సులో ఏం అనుకుంటే అది బ‌య‌ట‌కు చెప్పేసే పాత్ర చేస్తున్నా. చాలా స‌ర‌దాగా ఉంటుంది. హెడ్ స్ట్రాంగ్ ఫిల్మ్ మేక‌ర్‌గా క‌నిపిస్తాను. ఉమెర్ చిక్‌గా, మ‌రింత మోడ్ర‌న్‌గా క‌నిపిస్తా. నా లుక్ చూసి అంద‌రూ స‌ర్‌ప్రైజ్ అవుతారు.

ఏ ప్రాజెక్ట్ కైనా ప్రాణం పెట్టి ప‌నిచేస్తా. నా ప్రొఫెష‌న‌లిజం ఈ సినిమాలో మ‌రొక్క‌సారి క‌నిపిస్తుంది. అంద‌రికీ న‌చ్చే విధంగా బాబీ తీస్తున్నారు. వెంకీగారు, చైతూగారు ఫ్యాన్స్ కి ట్రీట్ అవుతుంది`` అని అన్నారు. ఈ సినిమాలో వెంక‌టేష్ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్ టీచ‌ర్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే కొన్ని పోస్ట‌ర్లు కూడా విడుద‌ల‌య్యాయి. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. `ప్రేమ‌మ్`లో నాగ‌చైత్య‌న‌కు మామ‌గా క‌నిపించారు వెంకీ. తాజాగా ఇద్దరూ క‌లిసి చేస్తున్నారు. ఇలా వీరిద్ద‌రూ క‌లిసి చేయ‌డం ఇదే తొలిసారి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.