close
Choose your channels

రేస్ టు ఫినాలే.. ఫైనల్ రౌండ్‌లో సొహైల్, అఖిల్..

Thursday, December 3, 2020 • తెలుగు Comments

రేస్ టు ఫినాలే.. ఫైనల్ రౌండ్‌లో సొహైల్, అఖిల్..

‘ఖేలో ఖేలో ఖేలోరే.. ’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. సొహైల్‌ని కూర్చోబెట్టి అవినాష్.. మోనాల్ తన్నడం గురించి చెప్పి బాధ పడ్డాడు. తన దగ్గరకు వెళితే ఏమీ కలిసి వస్తల్లేదని అభి చెప్పాడు. దూరంగా కూర్చొని అఖిల్ వీళ్ల కాన్వర్సేషన్‌ని వింటున్నాడు. ఏదిఏమైనా నువ్వు గేమ్ ఆపడం నాకు నచ్చలేదని సొహైల్ చెప్పాడు. సొహైల్‌ని విడివిడిగా ఆడలేదని ఒప్పించడానికి ట్రై చేస్తున్నాడు. అఖిల్ వచ్చి వాళ్లకు కొంచెం ఇద్దాంరా అంటే మేము వదిలేశామని సొహైల్ చెప్పాడు. అవినాష్, సొహైల్‌ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అఖిల్.. మేము ఇండివిడ్యువల్‌గానే ఆడామని.. ఒకరినొకరు గెలకవద్దని అనుకుని స్మార్ట్ గేమ్ ఆడామని చెప్పాడు. అవినాష్ మాత్రం వదలకపోవడంతో ఇద్దరూ కలిసి వాదించారు. హారిక కూడా అందరం కలిసి ఒక అండర్ స్టాండింగ్‌తోనే ఆడామని ఒప్పుకుంది. అవినాష్ మాత్రం రేస్ టు ఫినాలే టాస్క్ నుంచి బయటకు తప్పుకున్నందుకు బాగా ఫీల్ అవుతున్నాడు. మోనాల్ అబద్దాలు ఆడుతుందని క్లియర్‌గా అభికి చెప్పాడు. అవినాష్‌ని తన్నినట్టు తేలితే మాత్రం ఊరుకోనని సొహైల్ వచ్చి మోనాల్‌కి చెప్పాడు.

మోనాల్ వెళ్లి నేను నిన్ను తన్నానా అనేది నాకు గుర్తు రావడం లేదని సారీ చెప్పింది. కాళ్లు టచ్ చేసి మరీ మోనాల్ సారీ చెప్పింది. అది బయటకు బ్యాడ్‌గా వెళ్లిపోద్దని అవినాష్ ఫీల్ అయ్యాడు. ఫినాలే మెడల్ లెవల్ 2 టాస్క్ ప్రారంభమైంది. పై నుంచి పువ్వులు పడుతుంటాయి. వాటిని తీసుకుని మడ్ పిట్‌లో నాటాలి. ఎక్కువ పువ్వులు నాటిన ఇద్దరు ఫైనల్ రౌండ్‌కి సెలక్ట్ అవుతారు. నిన్నటి ట్రిక్కే ఫాలో అవుదామని అఖిల్.. సొహైల్‌కి చెప్పాడు. అఖిల్.. అభి.. సొహైల్.. హారిక మంచి ఎఫర్ట్ పెట్టి ఆడారు. అవినాష్ పూర్తిగా హారికకు సపోర్ట్ చేశాడు. ఒకవేళ నా ఫ్లవర్స్ తీసేస్తే నేను బెంచ్‌లే లేపేస్తా అని సొహైల్ చెప్పాడు. అఖిల్ కూడా అదే చెప్పాడు. అఖిల్, సొహైల్ కొన్ని పువ్వులను నాటకుండా దాచుకుంటే బిగ్‌బాస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అన్ని పువ్వులు ఆడాల్సిందేనని చెప్పారు. ఇది వ్యక్తిగత ఆట అని వెల్లడించారు. దీంతో అరియానా బాగా ఫీల్ అయింది.

రేస్ టు ఫినాలే.. ఫైనల్ రౌండ్‌లో సొహైల్, అఖిల్..

ముందుగా హారిక.. సొహైల్ చేతి నుంచి లాక్కోవడంతో బాగా ఫీల్ అయ్యాడు. హారికను ఆడనివ్వకుండా తనే ఆడాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మళ్లీ సొహైల్ వెళ్లి తను లాక్కున్నవన్నీ ఇచ్చి ఓదార్చడం చాలా క్యూట్‌గా అనిపించింది. తక్కువ పువ్వులున్న కారణంగా హారిక గేమ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నెక్ట్స్ అభిజిత్ అవుట్ అయ్యాడు. తరువాత క్లోజ్ ఫ్రెండ్స్ అఖిల్, సొహైల్‌ల మధ్య వార్. ఎవరు గెలుస్తారనేది ఇప్పటికే బయటకు వచ్చినప్పటికీ.. వీరిద్దరి గేమ్ ఎలా ఉండబోతోందనేదే ఆసక్తికరంగా మారింది. అవినాష్, అభి భోజనం చేస్తూ అరియానాను రమ్మని పిలిచాడు. అరియానా వచ్చి అవినాష్‌కి గిన్నెలు తోమాలని చెప్పింది. అరియానా రెస్పాన్సిబులిటీ తీసుకోమని చెప్పడం అవినాష్‌కి కోపం తెప్పించింది. మోనాల్‌కి అఖిల్ చెబుతున్నాడు. మా ఇద్దరికీ టికెట్ ఎవరికి వచ్చినా హ్యాపీయే అని చెప్పాడు. కానీ ఎఫర్ట్ మాత్రం పెడతానని చెప్పాడు. నేను రెస్పాన్సిబులిటి ఎక్కడ తీసుకోవాలో చెప్పమని అరియానాని అవినాష్ నిలదీశాడు. నన్నొక్కడినే ఎందుకన్నావని అవినాష్.. ఫ్రెండ్ అని చెప్పానని అరియానా.. చిన్న చిన్నవి కూడా కాలిక్యులేట్ అవుతాయని అవినాష్ చెప్పాడు. మరోవైపు సొహైల్.. అరియానా ఏదైనా చేసేటప్పుడు గెలికితే బాగా ఇరిటేట్ అవుతుందని అఖిల్‌కి చెప్పాడు. అరియానా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తోందని అవినాష్ బాగా ఫీల్ అయ్యాడు. ఒక్కొక్కరిలో ఉన్న స్ట్రెస్ అంతా బయటపడుతోంది. నేను నామినేషన్స్‌లో ఉన్నా.. అన్నీ రికార్డ్ అవుతున్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని అవినాష్ ఫీల్ అయ్యాడు. తరువాత అరియానా దగ్గరకెళ్లి అవినాష్ సారీ చెప్పి కన్విన్స్ చేశాడు.

Get Breaking News Alerts From IndiaGlitz