close
Choose your channels

టికెట్ టు ఫినాలే టాస్క్‌: రౌండ్‌ 2లోకి అఖిల్, సొహైల్, అభి, హారిక..

Wednesday, December 2, 2020 • తెలుగు Comments

టికెట్ టు ఫినాలే టాస్క్‌: రౌండ్‌ 2లోకి అఖిల్, సొహైల్, అభి, హారిక..

ఓపెనింగే అఖిల్ తన ఫ్యామిలీ ఫోటోని ముందు పెట్టుకుని దిల్‌తో ఆడలేదు.. దిమాక్‌తో ఆడానంటూ ఎమోషనల్ అయ్యాడు. సొహైల్ వెళ్లి అఖిల్‌ని మోనాల్‌ను ఏ కారణం చెప్పి నామినేట్ చేశావని అడిగాడు. ఆమెతో నాకొద్దని చెప్పాడు. నమ్మకం పోయిందని.. ప్రామిస్ చేస్తుంది దానిని తప్పుతుందని బాధపడ్డాడు. నేను దిమాక్‌తో ఆడుతున్నానన్నది.. దిల్‌తో ఆడట్లేదన్నదనేది అఖిల్ మెయిన్ పాయింట్. నేను పొరపాటున అన్నానని మోనాల్ చెప్పింది. తరువాత సొహైల్ వెళ్లి అవినాష్, అరియానాలకు 100 పర్సంట్ ఎఫర్ట్ ఇవ్వట్లేదు అంటున్నాడు కానీ ఆమె ఇస్తోందని సొహైల్ చెప్పాడు. నువ్వు నన్ను నామినేట్ చేసినందుకు బాధ పడట్లేదని.. నన్ను మాట అన్నందుకు బాధపడుతున్నానని మోనాల్‌కు అఖిల్ చెప్పాడు. మోనాల్ సారీ చెప్పినా అఖిల్ తీసుకోలేదు.

‘హూ ఆర్ యూ’ సాంగ్‌తో నెక్ట్స్ డే స్టార్ట్ అయింది. ఇవాళ రేస్ టు ఫినాలే మొదలైందని.. ఒక ఫినాలే మెడల్ పెట్టామని.. దానిని గెలుచుకున్న వాళ్లకు ఫినాలే లోకి ఎంట్రీ లభిస్తుందని బిగ్‌బాస్ చెప్పారు. ఫినాలే మెడల్ దక్కించుకున్న సభ్యులు నామినేషన్స్‌ను తప్పించుకుని ఫినాలే లోకి అడుగు పెడతారని అయితే ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడాలని బిగ్‌బాస్ చెప్పారు. అందరి ఫోటోల ముందుకెళ్లి సొహైల్ ఆడాలని ఫన్నీగా చెప్పడం నవ్వు తెప్పించింది. ఇక టికెట్ టు ఫినాలేలోని ఫస్ట్ టాస్క్. ఆవును పెట్టారు. బజర్ మోగినప్పుడల్లా దాని నుంచి పాలు వస్తాయి. కంటెస్టెంట్లలో ఎవరు ఎక్కువ పాలు పడితే వాళ్లు సెకండ్ రౌండ్‌కు అర్హులవుతారు. చాలా రోజుల తర్వాత మంచి ఫిజికల్ టాస్క్‌ను బిగ్‌బాస్ అరేంజ్ చేసినట్టు అనిపించింది. సొహైల్, అఖిల్ మధ్య కూడా చిన్నపాటి వార్ జరిగింది. మోనాల్ పట్టుకున్న పాలను అవినాష్ దొంగిలిచాడు.

తరువాత అవినాష్, మోనాల్‌ల మధ్య చిన్న పాటి వార్ జరిగింది. అవినాష్ మాటలు జారడం సొహైల్, అఖిల్‌లకు కోపం తెప్పించింది. అందరూ కలిసి నన్ను టార్గెట్ చెయ్యండి అని అవినాష్ అన్నాడు. అందరినీ అవినాష్ గెలికాడంటూ సొహైల్ ఫుల్‌గా ఫైర్ అయ్యాడు. తనను పట్టుకోనివ్వలేదని అవినాష్ చెప్పడంతో అఖిల్, సొహైల్ బాగా ఫైర్ అయ్యారు. ఇక్కడ టీంలు టీంలుగా ఆడుతున్నారని అవినాష్ ఆరోపించాడు. నేను ఆడనని అవినాష్ కూర్చున్నాడు. సొహైల్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. అవినాష్ పాలల్లో నీళ్లు, ఫ్రిజ్‌లో నుంచి నీళ్లు పోసుకోవడం చాలా ఫన్నీగా అనిపించింది. అన్ని కెమెరాలు ఉండగా... నీళ్లతో మేనేజ్ చేయాలనుకోవడం ఫన్నీగా అనిపించింది. అవినాష్ నీళ్లు కలిపిన విషయాన్ని అఖిల్ గుర్తించాడు. దీంతో బిగ్‌బాస్ ఈ రౌండ్ నుంచి అవినాష్‌ని బిగ్‌బాస్ తప్పించారు. అభి.. మీరిద్దరూ కలిసి ఆడుతున్నారా? అని అఖిల్, సొహైల్‌ని అడిగాడు. తరువాత పాల బాటిల్స్ తక్కువగా ఉండటంతో బిగ్‌బాస్.. అరియానాను గేమ్ నుంచి తప్పించారు.

అరియానా బాగా ఎమోషనల్ అయ్యింది. అవినాష్ ఓదార్చాడు. తరువాత మోనాల్ దగ్గర పాలు తక్కువగా ఉండటంతో ఆమెను కూడా బిగ్‌బాస్ తప్పించారు. రేస్ టు ఫినాలే సెకండ్ రౌండ్‌లోకి ఫైనల్‌గా అఖిల్, సొహైల్, హారిక, అభి ఎంటరయ్యారు. అవినాష్ క్యాన్‌ని పుష్ చేశానని.. అతడిని నేను తన్నలేదని మోనాల్ అఖిల్, సొహైల్‌లకు చెప్పింది. తరువాత అవినాష్ దగ్గరకు మోనాల్ వెళ్లింది. అప్పుడు అరియానా నువ్వు అవినాష్‌ని తన్నావా? అని అడిగింది. నేను తన్నలేదని మోనాల్ చెప్పింది. రేపు కూడా సెకండ్ లెవల్లో ఫిజికల్ టాస్క్‌నే బిగ్‌బాస్ అరేంజ్ చేసినట్టు ప్రోమోను బట్టి తెలుస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz