close
Choose your channels

‘రాధేశ్యామ్’ ఆసక్తికర ఫోటో విడుదల

Wednesday, February 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘రాధేశ్యామ్’ ఆసక్తికర ఫోటో విడుదల

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రభాస్ తొలి సినిమా ‘ఈశ్వర్’ ఆ తరువాత ఒకటి అర తప్ప ప్రభాస్ కెరీర్‌లోనే కంప్లీట్ లవ్ స్టోరీస్ ఇప్పటి వరకూ చేయలేదు. కానీ ఈ సినిమా పూర్తి లవ్ అండ్ ఎంటర్‌టైనర్ కావడంతో యూత్‌లో మరింత ఆసక్తి పెరిగింది. దీంతో సినిమాపై అంచనాలకైతే కొదువ లేదు.

ప్రభాస్ నేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడం.. ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఆయన ఇమేజ్‌ను ఈ చిత్రం మరింత పెంచే అవకాశం ఉంది. యూవీ కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గోపీకృష్ణా మూవీస్‌, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై వంశీ, ప్రమోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ సహా కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పీరియాడిక్ లవ్‌స్టోరి షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించి గతంలో కూడా ఒక అప్‌డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఈ రెండు అప్‌‌డేట్స్‌ను బట్టి చూస్తే ప్రభాస్, పూజాల మధ్య లవ్ స్టోరీకి దాదాపు ట్రైన్ వేదిక కాబోతోందని తెలుస్తోంది. కాగా.. తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు విడుదల చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పిక్‌తో పాటు ఓ ఆసక్తికర విషయాన్ని కృష్ణంరాజు వెల్లడించారు. ‘జూలై 30న ‘రాధే శ్యామ్‌’తో కాలంలో వెనక్కి వెళదాం’ అని కృష్ణంరాజు తెలిపారు. సోదరుడి కుమారుడు ప్రభాస్‌తో కలిసి ఆ సినిమా సెట్స్‌లో దిగిన ఫొటోను ఆయన ట్వీట్‌ చేశారు. సినిమాలో కృష్ణంరాజు ఓ పాత్ర పోషించినట్లు సమాచారం. ప్రభాస్, కృష్ణంరాజు ఫోటోకు మంచి ఫోజ్ ఇచ్చారు. వయసు మీద పడిన ఛాయలు కృష్ణంరాజు ఎక్కడా కనిపించనివ్వలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.