రాధేశ్యామ్ ఎన్ఎఫ్‌టి లాంచ్ నేడే: ఆ 100 మందికి ప్రభాస్‌ను కలిసే ఛాన్స్, త్వరపడండి

  • IndiaGlitz, [Tuesday,March 08 2022]

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- పూజా హెగ్డే నటించిన ‘‘రాధేశ్యామ్’’ ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. కోవిడ్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రభాస్, పూజాహెగ్డేలు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా వున్నారు. ఈ క్రమంలో రాధేశ్యామ్‌కు మరింత హైప్‌ తేవడం కోసం ప్రభాస్ అభిమానుల కోసం మార్చ్ 8న ఈ సినిమాకు సంబంధించిన ఎన్‌ఎఫ్‌టీ (NFT) లాంఛింగ్ జరగనుంది.

ఈ కలెక్షన్‌లో ప్రభాస్ డిజిటల్ ఆటోగ్రాఫ్, 3డి యానిమేటెడ్ డిజిటల్ ఆర్ట్‌తో పాటు ఎక్స్‌క్లూజివ్ 3డి యానిమేటెడ్ పిక్చర్స్ కూడా వుంటాయి. అంతేకాకుండా రాధేశ్యామ్‌లో ప్రభాస్ నడిపిన కారుకు సంబంధించిన 3డి యానిమేటెడ్ NFT కూడా ఇందులో వుంటాయి. వాటిని దక్కించుకోవాలని అనుకుంటున్న అభిమానులకు మార్చ్ 8 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ కలెక్షన్‌లో విజేతగా నిలిచిన 100 మంది లక్కీ విన్నర్స్ నేరుగా యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ను కలిసే బంపరాఫర్‌ను అందుకోనున్నారు. అంటే ఈ NFTలు ఎవరు ఎక్కువగా కొనుగోలు చేస్తే వాళ్లకు తమకు ఇష్టమైన స్టార్‌ను కలిసే అవకాశాలు పెరుగుతాయి.

ఇకపోతే.. పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా ‘రాధే శ్యామ్’ సినిమాను రూపొందించారు. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ఈ సినిమాను నిర్మించగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇందులో విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడి పాత్ర పోషించారు ప్ర‌భాస్.

More News

జగన్ కీలక నిర్ణయం.. సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు, అసెంబ్లీలో ప్రకటన

ఇటీవల గుండెపోటుతో మరణించిన గౌతమ్‌రెడ్డి మరణంపై ఏసీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో

ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తా... సినిమా టికెట్ ధరలపై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు

సినిమా టికెట్ ధరలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు సినీ ప్రముఖులు.. సీఎం జగన్ సహా మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు కూడా.

రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్... దళితబంధుకు ప్రాధాన్యత, ఏ రంగానికి ఎంతంటే..?

2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: బీజేపీకి షాక్.. సభ నుంచి ఈటల, రాజాసింగ్, రఘునందన్‌లు సస్పెండ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన తొలి రోజే బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావు‌లు సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు

భీమ్లా నాయక్ రిలీజ్ నాడు జంతు బలి... పవన్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు

భారత్‌లో సినీతారలకు వున్న క్రేజ్ సాధారణమైంది కాదు. వారిని దైవంలా ఆరాధిస్తారు అభిమానులు. వాళ్ల ఒంటిపై ఈగ వాలనివ్వరు. ఎవరైనా తమ అభిమాన హీరోని పల్లెత్తు మాటంటే అస్సలు ఊరుకోరు.