23.10.21 ... ఉదయం 11.16కి వీడనున్న విక్రమాదిత్య గుట్టు..!!

  • IndiaGlitz, [Thursday,October 21 2021]

పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా పూజాహెగ్డే ఆడిపాడనున్నారు. ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’, ‘గ్లిమ్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’, కొన్ని ప్రచార చిత్రాలు మినహాయించి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌లు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తూ.. ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ని బుధవారం ఉదయం చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రభాస్‌ పుట్టినరోజు కానుకగా అక్టోబర్‌ 23 శనివారం ఉదయం 11.16 గంటలకు రాధేశ్యామ్ టీజర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ వివరించారు

1980 సమయంలో యూరప్‌ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ ఇటలీలోనే జరిగింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత అలనాటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఈ సినిమాతో తెలుగు తెరపై సందడి చేయనున్నారు. కృష్ణంరాజు, సచిన్‌ ఖేడ్కర్‌, మురళీ శర్మ, కునాల్‌రాయ్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌, మిథున్‌, అనూమాలిక్‌, మనన్‌భరద్వాజ్‌(హిందీ), సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహాంస. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

More News

కొడుకు కోసం జైలుకొచ్చిన షారుఖ్.. ఆర్యన్‌‌కు ఓదార్పు, అరగంటపాటు అక్కడే

డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు నిన్న‌ ముంబై సెషన్స్ కోర్టు మరోసారి బెయిల్ నిరాక‌రించిన సంగతి తెలిసిందే.

'జీ5' ఒరిజినల్ మూవీ 'హెడ్స్ అండ్ టేల్స్' ట్రైలర్ కు అద్భుత స్పందన

అక్టోబర్ 22న నుండి 'జీ 5' ఓటీటీ వేదికలో ప్రీమియర్ కానున్న సినిమా వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు...

నవంబర్ 12న కార్తికేయ 'రాజా విక్ర‌మార్క‌' విడుదల

తెలుగు తెరపైకి నవంబర్ 12న కొత్త గూఢచారి రాబోతున్నాడు. యాక్షన్ ప్లస్ కామెడీతో నయా ఏజెంట్ విక్రమ్ పాత్రలో మన ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి కార్తికేయ గుమ్మకొండ

బిగ్‌బాస్ 5 తెలుగు: నువ్వు మగాడివేనా.. సన్నీని అంత మాటన్న ప్రియా, ‘‘గుడ్డు’’ పోరులో విన్నరెవరో..?

ఎప్పటిలాగానే బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల రచ్చ మళ్లీ మొదలైంది.

మెడలో తాళిబొట్టు.. సురేఖా వాణి సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకుందా, పిక్ వైరల్

తెలుగు చిత్ర సీమలో తల్లి, అక్క, వదిన, స్నేహితురాలి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖా వాణి.