మెగాస్టార్ - లారెన్స్ కలయికలో మరో డ్యాన్సింగ్ సెన్సేషన్..!

  • IndiaGlitz, [Thursday,October 13 2016]

డ్యాన్సుల్లో కొత్త ఒర‌వడి సృష్టించిన బెస్ట్ డ్యాన్సింగ్ స్టార్ ఎవ‌రు? అంటే మెగాస్టార్ చిరంజీవి పేరే చెబుతారు. అన్న‌య్య స్టెప్పుల్లో ఎన‌ర్జీ.. ఆ హుషారు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. 90ల‌లో అస‌లు బ్రేక్ డ్యాన్స్ అన్న ప‌దానికే ప‌ర్యాయ‌ప‌దంగా నిలిచిన చిరు కెరీర్ ఆద్యంతం
డ్యాన్సింగ్‌లో చేసిన ప్ర‌యోగాలు అసాధార‌ణం. ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ చిరు ల్యాండ్ మార్క్ స్టెప్పుల గురించి, డ్యాన్సింగ్ స్ట‌యిల్ గురించి న‌వ‌త‌రం మాట్లాడ‌కుండా ఉండ‌రు. నేటి త‌రం హీరోలు, కొరియోగ్రాఫ‌ర్లు డ్యాన్సులు ఏ స్థాయిలో చేయ‌గ‌లిగినా చిరు స్టైల్ డ్యాన్సులు చేయ‌డం క‌ష్ట‌మేన‌ని అంగీక‌రిస్తారు. అందుకే అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ డ్యాన్సుల్లో మెగాస్టార్ ఒక్క‌రే. ఆయ‌న స్టైల్ యూనిక్‌. ఆయ‌న మేన‌రిజ‌మ్స్ ఎక్స్‌క్లూజివ్‌.
ప్ర‌స్తుతం మెగాస్టార్ 'ఖైదీ నంబ‌ర్ 150' కోసం డ్యాన్సింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మ‌రోసారి త‌న‌దైన శైలిలో యూనిక్ స్టెప్పుల‌తో అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. హైద‌రాబాద్ -అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో మెగాస్టార్ చిరంజీవి - ల‌క్ష్మీరాయ్‌పై రాఘ‌వ లారెన్స్ మాష్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో భారీ సెట్‌లో ఓ స్పెష‌ల్ సాంగ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ పాట‌కు దేవీశ్రీ లిరిక్ అందించ‌డ‌మే కాకుండా అదిరిపోయే ట్యూన్ క‌ట్టారు. మూవీ హైలైట్ సాంగ్స్‌లో ఇదొక‌టిగా నిలుస్తుంద‌ని యూనిట్ చెబుతోంది.
మెగాస్టార్ - లారెన్స్ కాంబినేష‌న్ అన‌గానే మ‌న‌కు కొన్ని పాట‌లు గుర్తుకొస్తాయి. 'హిట్ల‌ర్‌' మూవీలో ''అబీబీ అబీబీ .. ' అంటూ చిరు వేసిన స్టెప్పులు క‌నుల ముందు క‌దులాడ‌తాయి. ఇంద్ర‌లోదాయి దాయి దామ‌... కులికే కుంద‌నాల కొమ్మ‌ సాంగ్‌లో వీణ స్టెప్ ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌. కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి..., మ‌న్మ‌ధ మ‌న్మ‌ధ .. సాంగ్స్‌(ఇంద్ర‌) కి లారెన్స్ మాష్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ గుర్తుకొస్తుంది. మ‌ళ్లీ చాలా గ్యాప్ త‌ర్వాత లారెన్స్ మెగాస్టార్‌కి స్టెప్పులు అందిస్తున్నారు. 150వ సినిమాతో మ‌ళ్లీ ఈ క‌ల‌యిక‌లో మ‌రో మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్సెస్‌ని తెలుగు ప్రేక్ష‌కులు వీక్షించే ఛాన్సుంద‌ని చెబుతున్నారు. పాట‌ల చిత్ర‌ణ‌తో పాటు బ్యాలెన్స్ షూటింగ్‌ని పూర్తి చేసి సైమ‌ల్టేనియ‌స్‌గా నిర్మాణానంత‌ర ప‌నులు సాగిస్తాం. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ ఇదివ‌ర‌కే తెలియ‌చేసారు.

More News

పూరి ఇజం సెన్సార్ పూర్తి..!

డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ -డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ఇజం.

కొడుకును చూసి మురిసిపోతున్న గోపీచంద్..!

పిల్ల‌ల ముద్దు ముద్దు మాట‌లు, ఆట‌లు  చూసి పేరెంట్స్ పొంగిపోతుంటారు క‌దా..! ఇప్పుడు హీరో గోపీచంద్ కూడా త‌న కొడుకు చెప్పే ముద్దు ముద్దు మాట‌ల‌తో తెగ మురిసిపోతున్నాడట‌.

ఆ రెండు చిత్రాల వలే మహిళ ప్రేక్షకులను ఆకట్టుకునే విభిన్న కథా చిత్రం నాగభరణం - నిర్మాత మల్కాపురం శివకుమార్

అమ్మోరు, దేవి, అరుంధతి..ఇలా గ్రాఫిక్స్ మాయాజాలంతో చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా కోడి రామకృష్ణ తాజాగా కన్నడలో తెరకెక్కించిన చిత్రం నాగరహవు.

బాహుబ‌లి 2 నైజాం హ‌క్కులు ఎసియ‌న్ ఎంట‌ర్ ప్రైజెస్ సొంతం..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అఖండ విజ‌యాన్ని సాధించిన బాహుబ‌లి చిత్రానికి రెండో భాగంగా రూపొందుతున్న బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ తెలంగాణ (నైజాం) హ‌క్కుల‌ను ఎసియ‌న్ ఎంట‌ర్ ప్రైజెస్ అధినేత‌లు నారాయ‌ణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు 50 కోట్ల ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకున్నారు.

చైతు గురించి నాగ్ కి లేఖ రాసిన రైట‌ర్..!

అక్కినేని నాగ చైత‌న్య గురించి నాగార్జున‌కు లేఖ రాసిన రైట‌ర్ ఎవ‌రో కాదు...అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన జె.కె.భార‌వి.