రాఘవ లారెన్స్ చేతుల మీదుగా 'వాడొస్తాడు' మోషన్ పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Saturday,July 15 2017]

2m సినిమాస్ బ్యానర్ పై కె.వి.శబరీష్ సమర్పిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'వాడొస్తాడు'. కిక్ శ్యామ్, ఆత్మీయ, శ్రీదేవి కపూర్ హీరోహీరోయిన్లుగా. సారథి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ ని జూలై 15 న ప్రముఖ కొరియా గ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా కె. వి.శబరీష్, సారథి లు మాట్లాడుతూ.. అడగగానే 'వాడొస్తాడు' మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన లారెన్స్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. హీరో శ్యామ్ ఈ 'వాడొస్తాడు' చిత్రంతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఈ చిత్రంలో శ్యామ్ కి జంటగా ఆత్మీయ, శ్రీదేవి కపూర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరితో పాటు హాలీవుడ్ ఆర్టిస్ట్స్ కూడా ఈ చిత్రం లో నటిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా..సినిమాని హై టెక్నికల్ వ్యాల్యూస్ తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాము...అని అన్నారు.
కిక్ శ్యామ్, ఆత్మీయ, శ్రీదేవి కపూర్, శ్రీనాథ్, జస్టిన్ వికాజ్(హాలీవుడ్), లూకాస్ శాండ్రాస్ (హాలీవుడ్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం ఎస్ రాజేష్ కుమార్, సంగీతం: శ్యామ్ మోహన్, ఆర్ట్: టీఎన్ కబిలన్, ఎడిటర్: అరుణ్ థామస్ ఏ.కె.డి, ప్రొడక్షన్ కంట్రోలర్: ఎం విజయ్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: టి.వి జనార్దన్, కుట్టి కృష్ణన్, మారియప్పన్ జి, పి.ఆర్.ఓ: పర్వతనేని రాంబాబు, నిర్మాణం: 24 సినిమాస్, సమర్పణ: కె.వి.శబరీష్, దర్శకత్వం: సారథి.

More News

తమిళ బ్లాక్ బస్టర్ 'కాదంబరి'గా తెలుగులో..!

తమిళంలో ఘనవిజయం సాధించిన `ఓరుబంతి నాల్రన్ ఓరు వికెట్` తెలుగులో `కాదంబరి` (ఇంటి నెంబర్ 150) పేరుతో అనువాదమై రిలీజవుతోంది.

యంగ్ డైరెక్టర్ తో నాగ్

కింగ్ నాగార్జున ఇప్పుడు `రాజుగారి గది2` సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాగార్జున చేయబోయే సినిమా ఏంటనేది తెలియడం లేదు.

అగష్టులో కామెడి నేపద్యంలో తెరకెక్కుతున్న 'సోడా గోలిసోడా' విడుదల

ఎస్.బి ఆర్ట్ క్రియోషన్స్ బ్యానర్ పై భువనగిరి సత్య సింధూజ నిర్మాత గా మెట్టమెదటిసారిగా నిర్మిస్తున్న చిత్రం సోడా గోలి సోడా..

మొదటి పార్ట్ లోనే ఎన్టీఆర్ థ్రిల్లింగ్ మూమెంట్స్..

సినిమా రంగంలోని స్టార్స్ అందరూ ఇప్పుడు బుల్లితెర వైపు కూడా దృష్టి సారిస్తున్నారు.

నాని క్లారిటీ ఇచ్చేశాడు...

వరుస విజయాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు దిల్రాజు నిర్మాణంలో `ఎంసిఎ` సినిమా చేస్తున్నాడు. తదుపరి నాని ఏ సినిమా చేస్తాడనే దానిపై ఈరోజు నాని అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు.