రాఘవేంద్రుడి 'పెళ్లి సందడి' మళ్లీ మొదలు కాబోతోంది

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అద్భుత సృష్టి ‘పెళ్లి సందడి’ గుర్తుంది కదా.. 1996లో శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో శ్రీకాంత్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘పెళ్లి సందడి మళ్లీ మొదలవబోతోంది.. తారాగణం త్వరలో..’ అంటూ రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదికగా తెలిపారు. నిజానికి దర్శకేంద్రుడు కొంతకాలంగా సినిమాలేవీ రూపొందించలేదు. కానీ ఇటీవల త్వరలోనే ఓ న్యూస్ చెబుతానని ప్రకటించారు. చెప్పిన ప్రకారమే.. పెళ్లి సందడి మళ్లీ మొదలవబోతోందని చెప్పి షాక్ ఇచ్చారు.

దీని గురించి లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ కూడా ట్వీట్ చేశారు. 'మంచి పాటలతో..' అని చంద్రబోస్ ట్వీట్‌లో తెలిపారు. ఆర్‌.కె.ఫిలింస్‌, ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకాలపై సినిమా రూపొందనుంది. ఎం.ఎం.కీరవాణ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి శివశక్తిదత్తా, చంద్రబోస్‌ పాటలను రాస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం నూతన నటీనటులను రాఘవేంద్రరావు ఎంచుకుంటారని సమాచారం. సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ ప్రారంభమైందని, త్వరలోనే నటీనటులెవరనే విషయాన్ని తెలియజేస్తామని ఆయన తెలిపారు.

రాఘవేంద్రరావు మళ్లీ పెళ్లి సందడి సినిమాను తెరకెక్కించనున్నట్టు చెప్పిన వార్త టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. నటీనటుల గురించి చర్చ కూడా మొదలైంది. అంతేకాదు.. ఈ సినిమా కోసం దర్శకేంద్రుడు శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను ఎంచుకున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. నాగార్జున నిర్మించిన 'నిర్మలా కాన్వెంట్' అనే సినిమా ద్వారా రోషన్ వెండితెరకు పరిచయమయ్యాడు. ఊహాగానాలు నిజమై ఒకవేళ దర్శకేంద్రుడు రోషన్‌ను ఎంచుకుంటే మాత్రం రోషన్ కెరీర్‌కి ఈ చిత్రం మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరి దర్శకేంద్రుడి మనసులో ఏ హీరో ఉన్నాడో ఆయన వెల్లడించే వరకూ వేచి చూడాలి.

More News

అల్లు అర్జున్, రానాలు నా ప్రయాణాన్ని అద్భుతం చేశారు: అనుష్క

లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో అనుష్క దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 'అరుంధతి'తో మొదలైన అనుష్క లేడీ ఓరియంటెడ్ మూవీస్ ప్రయాణం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల నుంచీ 'ఎక్స్‌పైరీ డేట్‌'కి మంచి స్పందన లభిస్తోంది! - మధు షాలిని

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్'‌. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్

జగన్ కేసుల విచారణ సోమవారానికి వాయిదా

ఏపీ ముఖ్యమంతి జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసు విచారణ సీబీఐ కోర్టులో శుక్రవారం జరిగింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ

ప్రభాస్‌ 21లో బిగ్‌ బి

ప్యాన్‌ ఇండియా స్టార్‌ పభాస్‌ 21వ సినిమా రేంజ్‌ పెరుగుతూ వస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్‌ నిర్మాతగా 'మహానటి' ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.

టీఆర్పీ స్కాంలో రిపబ్లిక్ టీవీ

ముంబైలో టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్ల(టీఆర్‌పీ) స్కాంను పోలీసులు బట్టబయలు చేశారు. టీవీ రేటింగ్‌లను నిర్ణయించే బార్క్‌ (బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రిసెర్చ్‌ కౌన్సిల్‌) తరఫున మీటర్ల మానిటరింగ్‌