ఆ అందమైన ప్రేమకథకు హీరోగా రఘు కుంచె...

‘పలాస 1978’ చిత్రంలో నటించి ఉత్తమ నటనను కనబరిచిన ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచెకు మరో అద్భుతమైన ఆఫర్ వరించింది. 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న మహిళ బయోపిక్‌గా రూపొందతున్న ఓ సినిమాలో ఆయన హీరోగా నటించనున్నారు.  గోగో మూవీస్ పతాకం‌పై పీరియాడిక్ మూవీగా ‘కథానళిని’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ద్విభాషా చిత్రంగా(తెలుగు-తమిళ్) నిర్మితమవుతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా, ఆమె భర్త మురుగన్‌గా రఘు కుంచె నటించనున్నారు.

ఈ చిత్రానికి మహేంద్ర కొక్కిరిగడ్డ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మహా విస్ఫోటనం వెనుక ఉన్న అందమైన ప్రేమకథే ఈ ‘కథానళిని’ చిత్రం అని దర్శకుడు మహేంద్ర తెలిపారు. అయితే 1991కు పూర్వం.. ఎవరికీ తెలియని నిజ జీవిత కథ కావడం విశేషం.  కాగా.. ఇప్పటికే సంగీత దర్శకుడిగా ఆపై సింగర్‌గా కూడా రఘు కుంచె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘47 డేస్’ చిత్రాన్ని మరో ముగ్గురితో కలిసి నిర్మించి నిర్మాతగా కూడా మంచి సక్సెస్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ‘కథానళిని’ చిత్రం తన నట జీవితానికి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని రఘు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

More News

పవన్ ట్వీట్.. ఏపీకి ప్రశంస.. తెలంగాణకు చురక!

అధికార పక్షంలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా? అనేది పక్కన బెడితే ప్రజా నాయకుడికి మంచిని మంచిగా ఒప్పుకున్నప్పుడే విలువ, గౌరవం ఉంటాయి.

ఎన్టీఆర్‌తో ఢీ కొట్ట‌డానికి మంచు హీరో ఒప్పుకుంటాడా?

కరోనా ప్రభావంతో ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం.. షూటింగ్స్ ఆగిపోయాయి. రెండు నెల‌లు త‌ర్వాత షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి.

నా మొద‌టి కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ మృతి న‌న్ను బాధిస్తోంది - అల్లు అర్జున్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో 'మాస్టర్ జీస‌, 'మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ' అని అంతా ప్రేమగా పిలిచే  ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గుండె పోటుతో శుక్రవారం క‌న్ను మూసిన సంగతి తెలిసిందే.

మోదీ లద్దాఖ్ పర్యటనపై పరోక్షంగా స్పందించిన చైనా..

లద్దాఖ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటించి సైనికుల్లో ఉత్సాహాన్ని నింపిన విషయం తెలిసిందే.

‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్‌ పేరుతో దారుణం.. కేసు నమోదు

సోషల్ మీడియా మోసాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. అమ్మాయిల నంబర్లను సేకరించి సెలబ్రిటీల పేరుతో కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.