ఫిబ్రవరి 21 న 'రాహు' రిలీజ్

  • IndiaGlitz, [Saturday,January 11 2020]

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న రాహు ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన గాత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్న సిధ్ శ్రీరామ్ పాడిన ‘‘ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి నే సాగగా.. పాదాలూ దూరాలు మరిచాయి ఒట్టూ మేఘాల్లో ఉన్నట్టుగా.. ఏమో ఏమో ఏమో’’ పాట ‘రాహు’కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిధ్ శ్రీరామ్ గానం చేసిన ఈ పాట హాంటింగ్ సాంగ్ అనిపించుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ: ‘‘ ప్రేమకథా చిత్రంలా కనిపించినా.. ఇదో థ్రిల్లర్ మూవీ. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతుంది. ప్రేమకథలోని బలమైన ఎమోషన్స్ ని ప్రజెంట్ చేస్తూనే అనుక్షణం ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా కథనం సాగుతుంది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాహుకి అసెట్ గా మారింది. థ్రిలర్స్ తెలుగులో కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తున్నాయి. రాహు వాటి సరసన నిలబడుతుంది అని కాన్ఫిడెంట్ గా మా టీం ఉంది. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

న్యూ ఎజ్ థ్రిలర్ గా రాబోతున్న రాహు చిత్రంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు నటిస్తున్నారు.

More News

మనసులను కదిలిస్తున్న పూజా హెగ్డే మాటలు

ఆస్ట్రేలియా అడవుల్లోని కార్చిచ్చు.. తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది.

ప్రభాస్‌తో త్రివిక్రమ్.. చర్చలు షురూ!

టాప్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

చిరు ఫోన్ కోసం వెయిటింగ్.. నాన్నకు చెప్పా!!

‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో

రక్తం ఉడిపోతోంది.. 25 కుర్రాడిలానే.. : చంద్రబాబు

వైసీపీ పాలన చూస్తుంటే రక్తం ఉడికిపోతోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

‘కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ కావాలి’

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.