రాహుల్‌కే మళ్లీ కాంగ్రెస్ పగ్గాలు.. కారణాలివీ..!

కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మళ్లీ యువరాజుకేనా..? తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి సోనియా గాంధీ తప్పుకోనున్నారా..? ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువరాజును పీఠమెక్కించాలని మళ్లీ కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందా..? అంటే ఢిల్లీలో తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది. వాస్తవానికి సోనియాకు వయసు మీదపడటం.. అనారోగ్యంతో ఉండటంతో ముందున్నంతగా చురుకుగా వ్యవహరించలేక పోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే రాహుల్‌కే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఈ మేరకు రాహుల్‌కు లైన్ క్లియర్ చేయడానికిగాను సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేయాలని.. ఈ ప్రక్రియ వీలైనంత త్వరలోనే ముగించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం దాదాపు 12 రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను పునర్‌ వ్యవస్థీకరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటిలో జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, బిహార్, అసోం, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

రాహుల్ మారాడు!
ఒకప్పుడు రాహుల్ వేరు.. ఇప్పుడు రాహుల్ వేరు.. ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే.. ఏ రాష్ట్రంలో కమలం పార్టీ వాడిపోతోందో.. అక్కడ వాలిపోయి అక్కడి ప్రజలకు హస్తాన్నిచ్చి పైకి లేపుతున్నారు రాహుల్. ఇలా తన గ్రాఫ్‌ను జనాల్లో పెంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రామ్‌లీలా మైదాన్‌లో భారత్ బచావో ర్యాలీకి రాహులే నేతృత్వం వహించడం.. సీఏఏకి వ్యతిరేకంగా రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టడం.. మీరట్‌లో సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో మృతుల కుటుంబాలను రాహుల్ పరామర్శలు ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో.. జార్ఖాండ్ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రాహులే కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

పట్టాభిషేకం!
ఇలా అన్ని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం.. ప్రభుత్వంపై మాటల యుద్ధం కురిపిస్తూ ఇరుకున పెడుతుండటంతో రాహుల్ అయితేనే అధ్యక్షుడిగా సెట్ అవుతారని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత లేదా.. ఫిబ్రవరి మొదటి వారంలో రాహుల్ పట్టాభిషేకం ఉంటుందని అధిష్టానం నుంచి లీకులు వస్తున్నాయ్. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడక తప్పదు. ఎనీ.. వే.. యువరాజు అడ్వాన్స్‌గా ఆల్ ది బెస్ట్!

More News

షాకింగ్: ఏపీలోనూ ‘దిశ’ లాంటి ఘటనే!?

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ‘దిశ ఘటన’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

'RRR' లో మ‌రో విప్ల‌వ వీరుడు

ద‌ర్శ‌కధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `RRR`.

జగన్ ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేసులు!!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని నాటి నుంచి నేటి వరకూ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.

ఆ స్టార్ డైరెక్ట‌ర్స్ క‌థ‌ల‌ను దొంగ‌లిస్తారట‌!!

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్స్‌గా పేరున్న వారిలో ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ఒక‌రు కాగా.. మ‌రొక‌రు అట్లీ. వీరిద్ద‌రిపై ఓ అప‌వాదు ఉంది.

విశాఖలో రాజధాని ఫిక్స్.. తరలనున్న శాఖలివే..!

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించే ప్రసక్తే లేదని ఎన్నికలకు ముందు చెప్పిన వైసీపీ నేతలు..