రాహుల్ రవీంద్రన్ 'హౌరా బ్రిడ్జ్ ' ఫస్ట్ లుక్ లాంచ్

  • IndiaGlitz, [Sunday,April 23 2017]
ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. విభిన్నమైన కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో మనముందుకు వస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ లాంచ్ తో పాటు సినీ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ పెట్టడం వెనక పెద్ద రీజన్ ఉంది. కానీ ఇప్పుడు రివీల్ చేయలేం. హ్యూమన్ రిలేషన్స్ కి ఈకథ బ్రిడ్జ్ గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాందినీ చౌదరి ఇందులో చాలా మంచి క్యారెక్టర్లో నటించింది. మనాలీ రాథోడ్ కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. దర్శకుడు రేవన్ చాలా క్లారిటీతో ఉన్నాడు. అధ్బుతమైన విజువల్స్ మిమ్మల్ని వండర్ చేస్తాయి. రెండు సాంగ్స్ బ్యాలెన్స్ తో కొంత టాకీ పార్ట్ తో చిత్రీకరణ పూర్తవుతుంది. అని అన్నారు.
చాందినీ చౌదరి మాట్లాడుతూ... ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ లభించింది. దర్శకుడు రేవన్ కు చాలా థాంక్స్. హీరో రాహుల్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఈసినిమా అందరికీ చాలా మంచి పేరు తెస్తుంది.
మనాలీ రాథోడ్ మాట్లాడుతూ.. నా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. మా డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ని ఇప్పుడే రివీల్ చేయొద్దన్నారు. అందాల రాక్షసి సినిమా చూసిన తర్వాత రాహుల్ కి పెద్ద అభిమానిని అయ్యాను. నాకు చాలా ఇష్టమైన నటుడు. అని అన్నారు.
దర్శకుడు రేవన్ మాట్లాడుతూ... ఇది నా రెండో ప్రాజెక్ట్. బూచమ్మ బూచోడు నాకు చాలా మంచి పేరు తెచ్చింది. రాహుల్ రవీంద్రన్ చాలా మంచి పెర్ ఫార్మర్. ఇది బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టాం. మే మొదటి వారంలో టీజర్ విడుదల చేసి...రెండో వారంలో ఆడియో రీలీజ్ చేసి... నెలాఖరున సినిమాతో మీ ముందుకు వస్తాం. అని అన్నారు.

More News

'వైశాఖం' సాంగ్స్ నాకు బాగా నచ్చాయి - రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్

ఆర్.జె.సినిమాస్ బేనర్పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి.దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'వైశాఖం'.

బోయపాటి, బెల్లంకొండ మూవీ రిలీజ్ డేట్

డైరెక్టర్ బోయపాటి శ్రీను,యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్ లో

ఏప్రిల్ 24 న శ్రీ ఏడిద నాగేశ్వరరావు 83వ జయంతి..

ఏప్రిల్ 24న శ్రీ ఏడిద నాగేశ్వరరావు 83వ జయంతి ...శంకరాభరణం,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు ,సితార ,సీతాకోకచిలుక మొ:

రవితేజకు మరో హీరోయిన్ దొరికేసింది..

మాస్ మహారాజా రవితేజ హీరోగా డెబ్యూ డైరెక్టర్ విక్రమ్ సిరి కొండ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'టచ్ చేసి చూడు'

మహేష్ 'స్పైడర్ ' వాయిదా పడుతుందా?

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా అంటే ఎంతో క్రేజ్ క్రియేట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.