రైల్వే శాఖ కీలక నిర్ణయం.. 21 నుంచి 40 కొత్త రైళ్లు..

  • IndiaGlitz, [Wednesday,September 16 2020]

కరోనా మహమ్మారిని జనాలు కొద్దికొద్దిగా విస్మరించడం మొదలు పెట్టారు. యథావిథిగా కార్యకలాపాలన్నీ కొనసాగుతున్నాయి. కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా దాదాపు కేంద్రం అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక రైల్వే విషయానికి వస్తే.. ఇప్పటికే కొన్ని రైళ్లు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మరి కొన్ని కొత్త రైళ్లను తిప్పేందుకు సిద్ధమైంది. కొత్తగా మారో 40 క్లోన్ రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది.

సెప్టెంబర్ 12 నుంచే రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ... కొత్తగా నడపనున్న క్లోన్ ట్రైన్స్‌ను ఈ నెల 21 నుంచి పట్టాలెక్కించనుంది. అయితే వీటిలో ప్రయాణించేందుకు కొన్ని నిబంధనలను రైల్వే శాఖ పెట్టింది. ముందుగా రిజర్వేషన్ ఉంటే తప్ప ఈ క్లోన్స్ ట్రైన్స్‌లో ప్రయాణం సాధ్యపడదు. అలాగే ఈ రైళ్లు నిర్దేశించిన కొన్ని స్టాపుల్లో మాత్రమే ఆగుతాయి. అయితే కొత్తగా నడపున్న రైళ్లలో బెంగుళూరు నుంచి ధనాపూర్..ధనాపూర్ నుంచి బెంగుళూరు వెళ్లే రైళ్లు ఉన్నాయి. ఇవి విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగనున్నాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి ధనాపూర్.. ధనాపూర్ నుంచి సికింద్రాబాద్‌కూ నడవనున్నాయి. ఈ కొత్త రైళ్ల కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి కొంత మేర ప్రయోజనం చేకూరనుంది.

More News

సుశాంత్ ఫామ్‌ హౌస్ పార్టీలకు సారా.. రియా వచ్చేవారు: రాయిస్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు అనేక మలుపులు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఆర్జీవీ బయోపిక్ పార్ట్ 1 షూటింగ్ స్టార్ట్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూడు భాగాల బయోపిక్ లో తొలి భాగం షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది.

బెజవాడ కనకదుర్గమ్మ రథంలోని 3 వెండి సింహాలు మాయం

ఏపీ దేవాలయాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటన ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

బిగ్‌బాస్ హౌస్‌లో బిర్యానీని చూడనట్లు బిహేవ్ చేస్తారు: సూర్యకిరణ్

బిగ్‌బాస్ సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సూర్యకిరణ్ ఓ ఇంటర్వ్యూలో హౌస్ గురించి పలు ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు.

శ‌ర్వానంద్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌...?

డైరెక్ట‌ర్‌గా తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. ర‌వితేజ‌, సిద్ధార్థ్ స‌హా