కలెక్షన్స్ తో అదరగొడుతున్న రాజ్ తరుణ్ 'అంధగాడు'

  • IndiaGlitz, [Saturday,June 03 2017]

విల‌క్ష‌ణ చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ను సాధిస్తున్న యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ 'అంధ‌గాడు'.గ‌తంలో ఈ కాంబోలో ఆడోర‌కం-ఈడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త సినిమాలు సూప‌ర్‌హిట్ అయ్యాయి. అంధ‌గాడుతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. అలాగే హిట్‌పెయిర్ రాజ్‌ర‌తుణ్‌, హెబ్బా ప‌టేల్‌కు కూడా హ్యాట్రిక్ మూవీగా నిలిచింది 'అంద‌గాడు'.
సినిమా ప్రారంభం నుండి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా విడుద‌లైన ఆట నుండే బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తోంది. తొలిరోజు 3.75 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన 'అంధ‌గాడు' రాజ్‌త‌రుణ్ కెరీర్‌లోనే హయ్య‌స్ట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా అంధ‌గాడు చిత్రాన్ని చూసి అందులో రాజ్‌త‌రుణ్ న‌ట‌న‌ను, సినిమాలో ట్విస్టులు ఎంతో బావున్నాయ‌ని అప్రిసియేట్ చేశారు.
ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారారు. సినిమాలో కామెడి, సెంటిమెంట్‌, ఎమోష‌న్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేజ‌ర్ హైలెట్‌గా రూపొందిన ఈ చిత్రం సాధిస్తున్న క‌లెక్ష‌న్స్ చూస్తుంటే డెఫ‌నెట్‌గా 'అంధ‌గాడు' చిత్రం రాజ్‌త‌రుణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌హిట్‌గా నిలుస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

'ఆరడుగుల బుల్లెట్ ' తప్పకుండా విజయం సాధిస్తుంది - గోపీచంద్

గోపీచంద్,నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో జయ బాలాజీ రియల్ మీడియా పతాకంపై

మొదటి వారం 20 కోట్లు షేర్ కలెక్ట్ చేసిన 'రారండోయ్ వేడుక చూద్దాం'

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై

జూన్ మొదటివారం లో 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' టీజర్

హరిహర చలన చిత్ర పతాకం పై హ్యాపెనింగ్ యంగ్ హీరో నందు హీరోగా,సౌమ్య హీరోయిన్ గా,

జూన్ 6న కేటీయార్ - రామ్ చరణ్ లు విడుదల చేయనున్న 'కాదలి' ఆడియో!

ఆసక్తికరమైన ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న 'కాదలి'ఇప్పటికే రానా, సమంత వంటి స్టార్ లు ప్రమోట్ చేయడం వల్ల విశేషమైన క్రేజ్ ను సంపాదించుకొంది.

'నువ్వు తోపురా' ఫస్ట్ లుక్ విడుదల

"లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" ఫేమ్ సుధాకర్ కొంత విరామం అనంతరం మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్స్ గత కొన్ని రోజులుగా ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి.