మే 20న రాజ్ తరుణ్ 'అంధగాడు' ట్రైలర్

  • IndiaGlitz, [Thursday,May 18 2017]

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ 'అంధ‌గాడు'గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'అంధ‌గాడు'. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రాజ్ త‌రుణ్‌, ఎ.కె ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌కే కాదు, రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జోడికి కూడా హ్యాట్రిక్ హిట్ మూవీగా నిలిచిపోతుంద‌ని నిర్మాత అనిల్ సుంక‌ర కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

శేఖ‌ర్ చంద్ర సంగీత సార‌థ్యంలో పాట‌ల‌ను సోష‌ల్ మీడియా, రేడియో ఎఫ్‌.ఎంల‌లో విడుద‌ల చేశారు. ఈ పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు చిత్ర యూనిట్ మే 20న థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ రావ‌డంతో మే 20న విడుద‌ల కానున్న ట్రైల‌ర్ ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతుంద‌ని యూనిట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. జూన్‌2న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల‌ను రీచ్ అయ్యేలా హై రేంజ్ ప్ర‌మోష‌న్స్‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రికిపాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.

More News

మళ్ళీ రాజమండ్రి వెళుతున్న చరణ్

మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి రాజమండ్రి పరిసరాల్లో ఇంత వరకు ఎవరూ చిత్రీకరించని నేచురల్ లోకేషన్స్లో మొదటి షెడ్యూల్ను పూర్తి చేశారు.

మూడోసారి హిట్ ద్వయం..

ప్రస్తుతం సూపర్స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్న ఎ.ఆర్.మురుగదాస్ తదుపరి సినిమా ఎవరితో

వనపర్తి హజ్రత్ సయ్యద్ రాజావలి దర్గాను సందర్శించిన నవీన్ విజయ్ కృష్ణ

ప్రముఖ మహిళా దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల మనవడు , సినీ హీరో డాక్టర్ నరేష్ విజయ కృష్ణ కుమారుడు నవీన్ విజయ కృష్ణ తెలంగాణ లోని వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలోని హజ్రత్ సయ్యద్ రాజా వలి దర్గా షరీఫ్ 406 ఉరుసు ఉత్సవాలలో పాల్గొనటానికి అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరీ ఆహ్వానం మేరకు ఆదివారం రావా వాలి దర్గా ను

మరోసారి తల్లికి బిడ్డగా నటిస్తుంది...

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే హీరో పక్కన గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కు ప్రాధాన్యత ఇచ్చేవారు.

హీరో సుశాంత్ కు పితృ వియోగం

టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఇంట్లో విషాదం నెలకొంది.