రాజ్‌త‌రుణ్ కొత్త చిత్రం 'ఇద్ద‌రి లోకం ఒక‌టే' ప్రారంభం

  • IndiaGlitz, [Monday,April 22 2019]

ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. ఈ బ్యాన‌ర‌పై యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్ హీరోగా ఓ కొత్త చిత్రం 'ఇద్ద‌రి లోకం ఒక‌టే' సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది.

జి.ఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు. దిల్‌రాజు, శిరీష్ ఆధ్వ‌ర్యంలో పూజా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించారు. ముహుర్త‌పు స‌న్నివేశానికి వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ క్లాప్ కొట్ట‌గా.. ప్ర‌సాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్‌రాజు మ‌న‌వ‌డు మాస్ట‌ర్ ఆరాన్ష్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా... దిల్‌రాజు మాట్లాడుతూ - 'ఇద్ద‌రి లోకం ఒక‌టే' రాజ్‌త‌రుణ్‌తో మా బ్యాన‌ర్‌లో చేస్తోన్న రెండో చిత్రం. జి.ఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తుండ‌గా.. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అబ్బూరి ర‌వి మాట‌ల‌ను అందిస్తున్నారు. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు న‌చ్చేలా సినిమా ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం అన్నారు.

రాజ్‌త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం: జి.ఆర్‌.కృష్ణ‌, సంగీతం: మిక్కీ జె.మేయ‌ర్‌, కెమెరా: స‌మీర్ రెడ్డి, డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి, ఎడిట‌ర్: త‌మ్మిరాజు

More News

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

గత మూడ్రోజులుగా స్టాక్ మార్కెట్స్‌ నష్టాలతోనే ముగుస్తున్నాయి.!. ఈ నెల మొదట్లో రేసు గుర్రాల్లా పరుగులు తీసిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు చతికిలపడ్డాయి. సోమవారం దేశీయ మార్కెట్స్ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.

'గబ్బర్‌సింగ్' ఆర్టిస్ట్‌ను ఢీ కొన్న కారు..

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన ‘గబ్బర్‌సింగ్‌’లో నటుడు ఆంజనేయులు తన నటనతో అందర్నీ మెప్పించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఓటర్లపై నోరు జారిన జేసీ దివాకర్ రెడ్డి

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా.. ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంటారు.

'ఏదైనాజ‌ర‌గొచ్చు' టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన వినాయ‌క్‌

ముఖ న‌టుడు శివాజీ రాజా త‌న‌యుడు విజ‌య్ రాజా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న‌ చిత్రం 'ఏదైనా జ‌ర‌గొచ్చు'. వెట్ బ్రెయిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సుధ‌ర్మ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

స‌ల్మాన్ ఖాన్‌పై మీటూ ఆరోప‌ణ‌లు

దేశ వ్యాప్తంగా మీటూ ఉద్య‌మం ఉధృతంగా జ‌రిగి ఇప్పుడిప్పుడే అస‌లు విష‌యం సైలెంట్ అవుతుంది.