కన్న‌డలోకి రాజ్‌త‌రుణ్ ఎంట్రీ

  • IndiaGlitz, [Thursday,November 07 2019]

మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు క‌న్న‌డలోనూ రాజ్‌త‌రుణ్ న‌టించ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ ఏడాది తెలుగులో ఘ‌న విజ‌యం సాధించిన 'బ్రోచెవారెవ‌రురా' సినిమాను క‌న్న‌డలో ర‌మేక్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో రెండు కీల‌క పాత్ర‌లుంటాయి. ఒక‌టి హీరో శ్రీవిష్ణు పాత్ర కాగా.. మ‌రొక‌టి స‌త్య‌దేవ్ పాత్ర‌. ఈ రెండింటిలో ఓ పాత్ర‌లో రాజ్‌త‌రుణ్ న‌టించ‌బోతున్నాడ‌ట‌. మ‌రో పాత్ర‌లో శైలేంద్ర బాబు త‌న‌యుడు సుమంత్ శైలేంద్ర హీరోగా న‌టిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ప్ర‌స్తుతం రాజ్‌త‌రుణ్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఇద్ద‌రి లోకం ఒక‌టే సినిమాను దిల్‌రాజు బ్యాన‌ర్‌లో చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. డిసెంబ‌ర్ 25న సినిమా విడుద‌లవుతుంది. అలాగే విజ‌య్ కుమార్ కొండ ద‌ర్శ‌క‌త్వంలో 'ఒరేయ్ బుజ్జిగా..' సినిమాలోనూ రాజ్‌త‌రుణ్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఒక్క తెలుగులో స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్నా కూడా రాజ్‌త‌రుణ్ ఏమాత్రం వెర‌వ‌క క‌న్న‌డలో ఎంట్రీ ఇవ్వాల‌నుకోవ‌డం ఓ ర‌కంగా ధైర్యం చేస్తున్న‌ట్లే. ఏదైతేనేం త‌న‌కు క‌న్న‌డ‌లో కూడా హీరోగా మంచి పేరు రావాల‌ని కోరుకుందాం.

More News

'పట్నఘఢ్' విడుదలపై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్ట్

అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పలువురు సినీ దిగ్గజాల ప్రశంసలు అందుకున్న దర్శకుడు, ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న 'నా బంగారు తల్లి'

కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మూవీ 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' - సుడిగాలి సుధీర్‌

'జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా' వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, 'రాజుగారి గది'

అట్టహాసంగా 'దర్బార్' మోషన్ పోస్టర్

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ద‌ర్బార్‌`.

బాలయ్యకు విలన్‌గా మారుతున్న బాలీవుడ్ స్టార్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

కొత్త ద‌ర్శ‌కుడితో నాగ్‌.. అస‌లు ట్విస్ట్ అదే!

రియాలిటీ షో బిగ్‌బాస్ 3ను కింగ్ నాగార్జున విజ‌య‌వంతంగా పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయ‌న త‌న ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాడ‌ట‌.