బ‌న్ని, ఉద‌య్‌ బాట‌లో రాజ్ త‌రుణ్?

  • IndiaGlitz, [Thursday,October 08 2015]

చిన్న‌వ‌య‌సులోనే క‌థానాయ‌కుడుగా త‌న‌కంటూ ఓ క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు రాజ్ త‌రుణ్‌. 'ఉయ్యాల జంపాల‌', 'సినిమా చూపిస్తా మావ' చిత్రాల‌తో రెండు వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న త‌రుణ్‌.. అతి త్వ‌ర‌లో రానున్న 'కుమారి 21 ఎఫ్‌'తో హ్యాట్రిక్ కొట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. సుకుమార్ నిర్మాణంలో తెర‌కెక్కిన ఈ చిత్రం విజ‌యం సాధిస్తే గ‌నుక‌.. చిన్న వ‌య‌సులోనే హ్యాట్రిక్ హిట్స్‌ని సొంతం చేసుకున్న హీరోల‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకుంటాడు త‌రుణ్‌.

ఇదివ‌ర‌కు ఈ జాబితాలో ఉద‌య్ కిర‌ణ్‌, అల్లు అర్జున్ ఉన్నారు. 'చిత్రం', 'నువ్వు నేను', 'మ‌న‌సంతా నువ్వే'ల‌తో ఉద‌య్ హ్యాట్రిక్ హిట్స్‌ని సొంతం చేసుకుంటే.. 'గంగోత్రి', 'ఆర్య‌', 'బ‌న్ని' చిత్రాల‌తో బ‌న్ని ఈ త‌ర‌హా ఫీట్‌ని రిపీట్ చేశాడు. మ‌రి రాజ్ త‌రుణ్ కూడా వారి అడుగు జాడ‌ల్లోనే వెళ‌తాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

More News

ర‌వితేజ టైటిల్ మార్పుకి కార‌ణం అదేనా?

'భ‌ద్ర'.. స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం తెలుగు తెర‌పై కాసుల వ‌ర్షం కురిపించిన చిత్ర‌మిది. ర‌వితేజ హీరోగా న‌టించిన ఈ సినిమాతోనే నేటి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.

లెక్క స‌రిపెడుతున్న‌ ర‌కుల్‌

2011లో రిలీజైన 'కెర‌టం'తో ఎంట్రీ ఇచ్చినా.. రెండేళ్ల త‌రువాత వ‌చ్చిన 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌'తోనే హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

అతనితో నయనతార మూడోసారి?

నయనతార హవా తమిళ నాట మాములుగా లేదు.అందుకే ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద హీరోలు,చిన్న హీరోలు అనే తేడా లేకుండా ఆమె పక్కన నటించేందుకు సిద్ధపడుతున్నారు.

అసిన్ పెళ్లి పై కామెంట్ చేసిన అనుష్క

టాలీవుడ్,కోలీవుడ్,బాలీవుడ్..టాప్ స్టార్స్ తో కలసి నటించిన అందాల భామ అసిన్. గజని సినిమాలో నటించిన అసిన్ ఆ..సినిమాలో ఎలాగైతే ఓ సెల్ ఫోన్ కంపెనీ ఓనర్ తో ప్రేమలో పడుతుందో...

బ్రూస్ లీ తమిళ్ ఆడియో రిలీజ్ వాయిదా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం బ్రూస్ లీ.