ఫైనల్ షెడ్యూల్ లో 'బెలూన్'

  • IndiaGlitz, [Wednesday,March 15 2017]

జై, అంజ‌లి, జ‌న‌ని అయ్య‌ర్ హీరో హీరోయిన్లుగా తెలుగు, త‌మిళంలో రూపొందుతోన్న హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ 'బెలూన్‌'. జ‌ర్నీ త‌ర్వాత జై, అంజ‌లి క‌లిసి న‌టిస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. హీరోలు కార్తీ, జ‌యం ర‌వి, విజ‌య్ ఆంటోని, విష్ణు విశాల్‌, సూర్య చేతుల మీదుగా విడుద‌లైన ఐదు డిఫ‌రెంట్ లుక్స్‌తో పాటు ప్రీ రిలీజ్ లుక్ సినిమా ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచాయి.
శినిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని మ‌హేష్ గోవింద‌రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లో పుష్య‌మి ఫిలిం మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై బెల్లం రామ‌కృష్ణారెడ్డి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ ఈ సినిమాలో కీల‌క‌మైన పాత్ర చేయ‌డం విశేషం. తెలుగులో ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను త్వ‌రలోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రెండు షెడ్యూల్స్ చెన్నైలో పూర్త‌య్యాయి. ఫైన‌ల్ షెడ్యూల్‌ను కొడైకెనాల్‌లో షూట్ చేస్తున్నారు. నాగినీడు విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుంటే, యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం, శ‌ర‌వ‌ణ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, రూబెన్ ఎడిటింగ్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు.

More News

స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో సుమంత్ హీరోగా చిత్రం ప్రారంభం

సుమంత్,ఆకాంక్ష సింఘ్ హీరో హీరోయిన్లుగా స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం హైద్రాబాద్ లో

'కన్నుల్లో నీ రూపమే' ట్రైలర్ లాంఛ్

ఏ.ఎస్.పి క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ భాసాని నిర్మాతగా నూతన దర్శకుడు బిక్స్ తెరకెక్కించిన సినిమా కన్నుల్లో నీ రూపమే.

'నగరం' ను సక్సెస్ చేసన ఆడియెన్స్ థాంక్స్ : రెజీనా

యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా,రెజీనా కథానాయికగా అశ్వనికుమార్ సహదేవ్ సమర్పణలో

అల్లు శిరీష్ సరసన హీరోయిన్ ఫిక్స్ అయ్యింది...

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో అల్లు శిరీష్ హీరోగా

జనసేన పతాక ఆవిష్కరణ

జనసేన పార్టీ ఆవిర్భవించి మూడు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పార్టీ పరిపాలన కార్యాలయం లో