ఆ హీరోల కోసం కథలు రెడీ చేస్తున్న రాజ్ తరుణ్..

  • IndiaGlitz, [Wednesday,November 18 2015]

ఉయ్యాలా జంపాలా మూవీతో హీరోగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్. ఆ త‌ర్వాత సినిమా చూపిస్తా మామ సినిమాతో మ‌రో స‌క్సెస్ సాధించాడు. ఇప్పుడు హ్యాట్రిక్ సాధించ‌డానికి కుమారి 21 ఎఫ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 20న రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే...రాజ్ త‌రుణ్ డైరెక్ట‌ర్ అవుదామ‌నుకుని ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చి...అనుకోకుండా హీరో అయిపోయాడు. అయితే డైరెక్ట‌ర్ అవ్వాల‌నే ఉద్దేశ్యంతో క‌థ‌లు రెడీ చేస్తున్నాడ‌ట‌. హీరో అల్లు అర్జున్, క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్...వీరిద్ద‌రి కోసం క‌థ‌లు రెడీ చేస్తున్నాడ‌ట‌. ఇటీవ‌ల సునీల్ క‌లిసిన‌ప్పుడు క‌థ గురించి చెబితే నువ్వే డైరెక్ష‌న్ చేయ్ అన్నార‌ట‌. భ‌విష్యత్ లో డైరెక్ష‌న్ చేస్తానో లేదో తెలియ‌దు కానీ..ప్ర‌స్తుతానికి న‌టుడిగా ఫుల్ బిజీగా ఉండ‌డం హ్యాపీగా ఉందంటున్నాడు రాజ్ త‌రుణ్‌.అది సంగ‌తి.

More News

బన్ని నెక్ట్స్ మూవీ ఫిక్స్...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

'అఖిల్ ' కీ అదే జరిగింది

సినిమా ఫీల్డ్ లో కొన్ని కొన్ని సెంటిమెంట్లను నమ్మక తప్పదు.ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో.ఈ మధ్యే విడుదలైన''అఖిల్'' చిత్రం విషయంలోనూ ఇది చోటుచేసుకుంది.

మళ్లీ అనుష్కతోనే..

పాల బుగ్గల సుందరి హన్సిక..తెలుగు,తమిళ భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.వీలైతే మెయిన్ హీరోయిన్..లేదంటే సెకండ్ లీడ్ అన్నట్లుగా కెరీర్ ని సాగిస్తోందీ సుందరి.

40 వసంతాలను పూర్తి చేసుకుంటున్న మోహన్ బాబు

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో నటుడిగా నాలుగు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకుంటున్న క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు సినిమా చ‌రిత్ర‌లో క‌లెక్ష‌న్ కింగ్ తెలుగు సినిమా చ‌రిత్ర‌లో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఒక అధ్యాయం.

భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో రానా

బాహుబ‌లి చిత్రంతో బాగా పాపుల‌ర్ అయిన ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 లో న‌టిస్తున్నారు.