close
Choose your channels

అనుభవించు రాజా టీజర్: భీమవరం బుల్లోడుగా రాజ్ తరుణ్ సందడి

Thursday, September 23, 2021 • తెలుగు Comments

అనుభవించు రాజా టీజర్: భీమవరం బుల్లోడుగా రాజ్ తరుణ్ సందడి

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ వంటి వరుస బ్లాక్ బస్టర్లతో మంచి ఊపులో వున్న రాజ్ తరుణ్‌ బాగానే స్టార్ డమ్ సంపాదించాడు. కానీ ఆ జోష్‌ను అలాగే కంటిన్యూ చేయడంలో ఈ కుర్రాడు ఫెయిల్ అయ్యాడు. కథల ఎంపికలో తప్పులు, అవకాశం వచ్చింది కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడంతో ఫ్లాపులు పలకరించాయి. `అనుభ‌వించురాజా` అంటూ మ‌ళ్లీ త‌న కామెడీ టైమింగ్ ని న‌మ్ముకున్నాడు. మెగా పవర్‌స్టార్ రామ్ చ‌రణ్ తేజ్ చేతుల మీదుగా ఈరోజున ‘‘అనుభవించు రాజా’’ ట్రైల‌ర్ విడుద‌లైంది.

అనుభవించు రాజా టీజర్: భీమవరం బుల్లోడుగా రాజ్ తరుణ్ సందడి

‘‘ అయినా బంగారం గాడు ఊర్లోనీ, ఆడి పుంజు బ‌రిలోనీ ఉండ‌గా, ఇంకో పుంజు గెల‌వ‌డం క‌ష్ట‌మెహె..” అనే డైలాగ్ తో పూల రంగ‌డు గెట‌ప్ లో… రాజ్ త‌రుణ్ ఎంట్రీ ఇచ్చాడు. రాజ్ త‌రుణ్ బాడీ లాంగ్వేజ్ కి త‌గిన‌ట్టే, క్యారెక్ట‌రైజేష‌న్ పక్కాగా కుదిరింది. గోదారి జిల్లా వాళ్ల ఎట‌కారం, అక్క‌డి నేటివిటీ.. టీజ‌ర్‌లో కొట్టొచ్చినట్లు క‌నిపించింది. తెలుగు నాట సంక్రాంతి వేడుకలు, కోడిపందాలు అంటే భీమవరం గుర్తొస్తోంది. ఇది అచ్చంగా అలాంటి పందాల రాయుడి క‌థే. కోడి పందాలు, పేకాట‌, బెట్టింగ్ ఇదే జీవితంగా గ‌డిపేసే ఓ కుర్రాడి అల్ల‌రి కలిపితేనే ‘‘ అనుభ‌వించురాజా. ”

అనుభవించు రాజా టీజర్: భీమవరం బుల్లోడుగా రాజ్ తరుణ్ సందడి

‘‘ తిప్పే కొద్దీ తిర‌గ‌డానికి అదేమైనా ఫ్యాను స్పీడేంట్రా… ఉన్న నాలుగు ఎంట్రుక‌లూ ఊడిపోతాయ్‌” అంటూ రాజ్ త‌రుణ్‌పైనే ఓ పంచ్ పడింది.

”నీ బాధ నాక‌ర్థ‌మైంది.. నువ్వు గెలిచి నా ప‌రువు కాపాడితే.. సాయింత్రం నీ గంప కింద నాలుగు పెట్ట‌లు పెడ‌తా” అంటూ కోడి పుంజుని బుజ్జ‌గించిన స్టైల్ చూస్తుంటే – క‌చ్చితంగా ఈ సినిమా ఫ‌న్ రైడ్ లా సాగుతుంద‌నిపిస్తోంది.

అన్న‌పూర్ణ స్టూడియోస్‌, ఎస్వీసీ (ఎల్‌.ఎల్‌.పీ) సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీ‌ను గ‌విరెడ్డి ద‌ర్శ‌కుడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. పోసాని కృష్ణమురళి, ఆడుగలమ్‌ నరేన్, అజయ్ సుదర్శన్, టెంపర్‌ వంశీ, ఆదర్శ్‌ బాలకృష్ణ, రవికృష్ణ, భూపాల్‌ రాజు, అరియానా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz