Download App

Raja The Great Review

డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌తో త‌న‌కంటూ మాస్ మ‌హారాజా అనే ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ర‌వితేజ‌. 2015లో బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత రెండేళ్లు వ‌ర‌కు ఏ సినిమా చేయ‌లేదు. ఈ గ్యాప్ త‌ర్వాత ర‌వితేజ హీరోగా వ‌చ్చిన చిత్ర‌మే `రాజా ది గ్రేట్‌`. 13 ఏళ్ల క్రితం ర‌వితేజ‌తో భ‌ద్ర సినిమా చేసిన దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల‌తో స‌క్సెస్ కొట్టిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కింది. క‌మ‌ర్షియ‌ల్ ఇమేజ్ ఉన్న హీరో, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో సినిమాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు. వ‌రుస విజ‌యవంత‌మైన సినిమాల‌ను చేస్తోన్న నిర్మాత. ఈ ముగ్గురి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రాజా ది గ్రేట్ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించిందో చూద్దాం

క‌థ:

రాజా (ర‌వితేజ‌)కు పుట్టుక‌తో క‌ళ్లు క‌నిపించ‌వు. అతని త‌ల్లి అనంత‌ల‌క్ష్మి (రాధిక‌) పోలీస్ ఆఫీస‌ర్‌. త‌న బిడ్డ కోసం భ‌ర్త‌ను కూడా దూరం చేసుకుని బ‌తుకుంది. కొడుకును ఎలాగైనా పోలీస్ ఆఫీస‌ర్ చేయాల‌న్న‌ది ఆమె క‌ల‌. ఇంత‌లో పోలీస్ ఉన్న‌తాధికారి (ప్ర‌కాశ్‌రాజ్‌), లోక‌ల్ విల‌న్ దేవ‌రాజ్‌ త‌మ్ముడిని చంపేస్తాడు. అత‌నికి ఆ ఆప‌రేష‌న్‌లో సొంత కూతురు (ల‌క్కీ) సాయ‌ప‌డుతుంది. ల‌క్కీ వ‌ల్ల త‌న త‌మ్ముడు చ‌నిపోయాడ‌ని తెలుసుకుని దేవ‌రాజ్ ఆమెను ఎత్తుకొచ్చేస్తాడు. ఆమెను విల‌న్ చెర నుంచి విడిపించ‌డానికి పోలీసులు న‌లుగురు ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఆ త‌ర్వాత ల‌క్కీ డార్జిలింగ్ చేరుకుంటుంది. ఆమె కోస‌మే అక్క‌డికి వెళ్లిన రాజా ఆమెకు ఎలా ద‌గ్గ‌ర‌య్యాడు?  విల‌న్ దేవ‌రాజ్ చెర నుంచి ఆమెను ఎలా కాపాడాడు?  రాజా త‌ల్లి క‌ల ఏమైంది?  రాజాకి పోలీస్ డిపార్ట్ మెంట్ లో అవ‌కాశం దొరికిందా?  లేదా? అనేది ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్లు:

అంధుడి పాత్ర‌ను మ‌ల‌చ‌డంలో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాస్త హోమ్ వ‌ర్క్ చేశాడ‌నిపిస్తోంది. కేర‌క్ట‌రైజేష‌న్‌ను రాసుకునేట‌ప్పుడు దానికి కాస్త స్టైల్ జోడించిన‌ట్టు క‌నిపిస్తోంది. హీరో అంధుడైన‌ప్ప‌టికీ ఎదురుగా వంద‌లాది మంది ఉన్నా క‌న్విన్సింగ్‌గా కొట్టే యాక్ష‌న్ ఎపిసోడ్స్ ను ప్లాన్ చేశారు. ర‌వితేజ కూడా ఆ మేన‌రిజాల‌ను ప‌ట్టుకోగ‌లిగారు. ఆయ‌న త‌న‌యుడు మ‌హాధ‌న్ కూడా అంధుడి పాత్ర‌లో మెప్పించారు. రాధిక , ప్ర‌కాశ్‌రాజ్‌, పోసాని, త‌నికెళ్ల భ‌ర‌ణి, పృథ్వి, అలీ .. ఇలా అంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో మెప్పించారు. విల‌న్ చూడ్డానికి బావున్నాడు. మెహ‌రిన్ బొద్దుగా క‌నిపించింది. అన్న‌పూర్ణ‌మ్మ, రాజేంద్ర‌ప్ర‌సాద్ పార్ట్ న‌వ్విస్తుంది.

మైన‌స్ పాయింట్లు:

సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్న‌ప్ప‌టికీ, సినిమా పూర్త‌య్యే స‌మ‌యానికి ఎవ‌రూ గుర్తుండ‌రు. సెకండాఫ్ లో ఓ పాట‌లో రాశీఖ‌న్నా క‌నిపించినా, మ‌రో పాట‌లో సంపూర్ణేష్ బాబు, సప్త‌గిరి వంటివారు క‌నిపించినా పెద్ద ఎఫెక్టివ్‌గా ఏమీ అనిపించ‌వు. ఫ‌స్ట్ పాట మిన‌హా మిగిలిన పాట‌లు కూడా పెద్ద‌గా ట‌చింగ్‌గా లేవు. మెహ‌రీన్ ముఖంలో భావాలు ప‌ల‌క‌లేదు. ఏ ఎమోష‌న్ కూడా స్ట్రాంగ్‌గా క్యారీ కాలేదు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, విద్యుల్లేఖ, పృథ్వి, అలీ వంటివారు సినిమా పూర్త‌య్యే స‌మ‌యానికి ఆడియ‌న్స్ కి గుర్తుండ‌రు. క్లైమాక్స్ ఎంత‌కీ రానంత సాగ‌దీద‌తా సెకండాఫ్ విసుగుపుట్టిస్తుంది.

స‌మీక్ష:

రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ర‌వితేజ చేసిన ఈ రాజాది గ్రేట్ చిత్రంలో పూర్తిస్థాయి అంధుడుగా న‌టించ‌డం, క‌మ‌ర్షియ‌ల్ వేల్యూస్ ఉన్న ఓ హీరో ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం గొప్ప విష‌యం. ఈ విష‌యంలో ర‌వితేజ‌ను అభినందించాలి. ర‌వితేజ ఎప్ప‌టిలాగానే త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌తో, డైలాగ్ డెలివ‌రీతో ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ర‌వితేజ త‌న‌యుడు మహాధ‌న్ కాసేపే తెర‌పై క‌నిపించినా చ‌క్క‌గానే న‌టించాడు. ఇక హీరోయిన్ మెహ‌రీన్ లుక్స్ ప‌రంగా బాగానే ఉన్నా, బొద్దుగా క‌న‌ప‌డుతుంది. న‌ట‌న ప‌రంగా ఓకే అనిపించింది. ఇక ప్ర‌కాష్ రాజ్‌, రాధిక‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, సంప‌త్‌లు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. తొలిసారి విల‌న్‌గా న‌టించి వివాన్ బాట్నే ఓ లుక్‌లో క‌బీర్‌లాగా అనిపించాడు. నేనో అద్భుతం..అంటూ వివాన్ బాట్నే ప్రేక్ష‌కుల‌ను త‌న‌వంతుగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. రాశిఖ‌న్నా, స‌ప్త‌గిరి, సంపూర్ణేష్ బాబు, స‌త్య‌లు సాంగ్స్‌లో మెరిశారు. అయితే ఆ సాంగ్స్‌కున్న ప్ర‌త్యేక‌త‌లెంటో డైరెక్ట‌ర్‌కే తెలియాలి. అలాగే అనిల్ సినిమాకు గ్రాండియ‌ర్‌ను తెప్పించే ఆలోచేన‌లే చేశాడ‌నిపించిందే త‌ప్ప క‌థ‌పై శ్ర‌ద్ధ పెట్ట‌లేదు. క‌థ‌లో కొత్త‌ద‌నం క‌న‌ప‌డ‌లేదు. బ‌ల‌మైన ఎమోష‌న్స్‌, డ్రామా తెర‌పై క‌న‌ప‌డ‌దు. మోహ‌న‌కృష్ణ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సాయికార్తీక్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోసోగానే ఉంది. పాట‌లు ఏవీ రిజిష్ట‌ర్ కావు. సెకండాఫ్‌లో ర‌వితేజ బిల్డ‌ప్ కోస‌మే స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన‌ట్లు క‌న‌ప‌డుతుంది. రెండు, మూడు చోట్ల ప్రేక్ష‌కుడికి ఇదేనా క్లైమాక్స్ అనిపించేలా స‌న్నివేశాల‌ను డిజైన్ చేసుకున్నారు. మొత్తం మీద బి, సి సెంట‌ర్స్ ఆడియెన్స్‌కు సినిమా క‌నెక్ట్ కావ‌చ్చు. అలాగే ర‌వితేజ అభిమానులు సినిమాను ఓసారి ఎంజాయ్ చేస్తారు.

బోట‌మ్ లైన్: రాజాది గ్రేట్... ముఖ చిత్రం ప‌రావాలేద‌నిపిస్తుందంతే..

Raja The Great Movie Review in English

Rating : 2.8 / 5.0