close
Choose your channels

‘ఆర్ఆర్ఆర్‌’... ప్లాన్ మార్చేసిన జ‌క్క‌న్న‌

Thursday, January 21, 2021 • తెలుగు Comments

‘ఆర్ఆర్ఆర్‌’... ఇండిపెండెన్స్ డే ప్లాన్ మార్చేసిన జ‌క్క‌న్న‌

ద‌ర్శ‌కధీరుడు ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తోన్న పిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’. ప్రీ ఇండిపెండెన్స్ ముందు అంటే 1920 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇందులో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తుంటే, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇద్ద‌రు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌కు సంబంధించిన క‌ల్పిత క‌థాంశంతో రూపొందుతోన్న చిత్రం. స్వాతంత్య్ర కోసం పాటు ప‌డ్డ ఇద్ద‌రు వీరులు కాబ‌ట్టి.. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ జ‌న‌వ‌రి 26న గ‌ణ తంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ట్రిపులార్ టీజ‌ర్‌ను కాకుండా సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తార‌ట‌. ఇప్ప‌ట్లో టీజ‌ర్ విడుద‌ల చేయ‌డానికి రాజ‌మౌళి ఇష్ట‌ప‌డ‌టం లేదు. ప్ర‌స్తుతం సినిమా క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. 

ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో పాటు ఇతర కీలకపాత్రల్లో నటిస్తోన్న బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్‌, ఒలివియా మోరిస్, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్‌ ఇండియా తారాగణంతో రూపొందుతోన్న ఈ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021 ద‌స‌రాకు విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేసుకుంటున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz