రాజ‌మౌళి 'ఆర్ఆర్ఆర్‌' రిలీజ్ ప్లాన్ మార్పు

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ఇందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్.. గోండు వీరుడు కొమురంభీమ్ పాత్రలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండు నిజమైన చారిత్ర‌క పాత్రల క‌ల్పిత‌గాథే ఈ చిత్రం. రూ.400 కోట్ల‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా బ్రిటీష్ భామ ఒలివియా మోరిస్ న‌టిస్తుండ‌గా రామ్‌చ‌ర‌ణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తోంది.

ఈ సినిమాను ముందు ఈ ఏడాది జూలై 30న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే చిన్న చిన్న కార‌ణాలు, మేకింగ్‌లో కాంప్ర‌మైజ్ కావాల‌నుకోక‌పోవ‌డంతో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేస్తామ‌ని అధికారికంగా ప్ర‌కటించారు. కానీ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో సినిమా విడుద‌ల వచ్చేఏడాది సంక్రాంతికి కూడా ఉండ‌క‌పోవ‌చ్చున‌ని రాజ‌మౌళి తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం మేర‌కు ‘ఆర్ఆర్ఆర్‌’ను రాజ‌మౌళి వ‌చ్చే ఏడాది జూలైలో విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. దాదాపు ఇది ఖాయ‌మ‌ని అంటున్నారు. దీంతో వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలోని మెగాస్టార్ ఆచార్య వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

More News

చిరు 153లో స‌ల్మాన్‌..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల‌నుకోవ‌డం లేద‌ట‌.

సూర్య‌కు జోడీగా రాశీఖ‌న్నా

హీరో సూర్య త‌న 38వ చిత్రం శూర‌రై పోట్రు(ఆకాశం నీ హ‌ద్దురా)ని కరోనా ప్రభావం తగ్గిన తర్వాత విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలుజ‌రుగుతున్నాయి.

నిఖిల్ పెళ్లి వాయిదా

హీరో నిఖిల్ పెళ్లి మ‌రోసారి వాయిదా ప‌డింది. ఈ విష‌యంపై ఆ హీరోనే ఇంట‌ర్వ్యూలో స్పందించారు. ఏప్రిల్ 16న నిఖిల్ డాక్ల‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు.

త‌మిళ హీరోతో మెగాడాట‌ర్‌

మెగా బ్ర‌ద‌ర్ త‌న‌య నిహారిక కొణిదెల ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. ఈమె చేసిన సూర్య‌కాంతం, అంత‌కు ముందే విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ కార్తీక్‌ల‌తో ఓ త‌మిళ సినిమాలో

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయ్!

కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ బయటపడినట్లే అని గత వారం రోజులుగా అనిపించినప్పటికీ.. రెండు మూడ్రోజులుగా కేసులను బట్టి చూస్తే మళ్లీ విజృంభిస్తోందని చెప్పుకోవచ్చు.